Site icon NTV Telugu

Harassment: బైక్ పై వెళ్తున్న అమ్మాయిలను వేధిస్తున్న పోకిరీలు.. ముగ్గురిని గుర్తించి పట్టుకున్న పోలీసులు

Madapur Police

Madapur Police

మాదాపూర్ లో పోకిరీల కిరాతకం వెలుగుచూసిన విషయం తెలిసిందే. బైక్ పై వెళ్తున్న అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు పోకిరీలు. ముగ్గురు పోకిరీలు బైక్ పై ప్రయాణిస్తూ అమ్మాయి బ్యాక్ సైడ్ టచ్ చేసి వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ ప్రయాణికురాలు పోకిరీల ఆగడాలపై వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. ముగ్గురు పోకిరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులను కోరింది. దీంతో ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు పోకిరీలను గుర్తించారు. మాదాపూర్ పోలీసులు ముగ్గురు పోకిరీలను పట్టుకున్నారు.

Exit mobile version