Site icon NTV Telugu

Bihar elections: బిహార్‌ ఓటర్‌ లిస్ట్‌లో ఇద్దరు పాకిస్థానీ మహిళలు.. కేంద్రం సీరియస్

05

05

Bihar elections: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం బిహార్ ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారాయి. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఈసీని టార్గెట్ చేసుకొని వరుస విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు ఎక్కడలేని ప్రాధాన్యత లభించింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై.. అంతా సవ్యంగానే ఉందని ఎన్నికల సంఘం వివరణ ఇస్తూ వస్తుంది. ఈక్రమంలో తాజాగా బిహార్‌లో ఇద్దరు పాకిస్థానీ మహిళలకు ఓటరు కార్డు జారీ కావడంతో కేంద్రం సీరియస్ అయ్యింది. దీనిపై వెంటనే హోంశాఖ చర్యలకు ఉపక్రమించింది. వారి పేర్లను వెంటనే తొలగించాలని యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది.

READ ALSO: Ghaati : అనుష్కకు ఏమైంది.. ఎందుకు ఇలా చేస్తోంది..?

భాగల్పూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఘటన..
1956లో పాకిస్థాన్ నుంచి ఇమ్రానా ఖానమ్ అలియాస్ ఇమ్రానా ఖాటూన్, ఫిర్దోషియా ఖానమ్ అనే ఇద్దరు మహిళలు బిహార్‌లోని భాగల్పూర్ జిల్లాకు వచ్చారు. ఇటీవల వారికి ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేయబడ్డాయి. అలాగే వారి ఓటరు గుర్తింపు కార్డులు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో కూడా ధృవీకరించబడ్డాయి. విషయం బయటికి రావడంతో కేంద్రం హోం మంత్రిత్వ విచారణకు ఆదేశింది. జిల్లా మేజిస్ట్రేట్ (DM) ఆదేశాల మేరకు వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఇద్దరు మహిళల్లో ఫిర్దోషియా 1956లో మూడు నెలల వీసాపై, ఇమ్రానా మూడేళ్ల వీసాపై ఇండియాకు వచ్చి భాగల్పూర్ జిల్లాలోని భికన్పూర్లో స్థిరపడ్డారు.

భాగల్పూర్ కలెక్టర్ డాక్టర్ నావల్ కిషోర్ చౌదరి మాట్లాడుతూ.. హోం మంత్రిత్వ శాఖ నుంచి సూచనలు అందాయని తెలిపారు. వారి పేర్లు ఓటరు జాబితాలో కనిపించాయని, ధ్రువీకరణ తర్వాత, తాము ఫారం-7 నింపి, అవసరమైన విధంగా పేర్లను తొలగించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ ఇద్దరు మహిళలకు నోటీసులు పంపనున్నట్లు వెల్లడించారు.

READ ALSO: Russia Ukraine war: తగలబడుతున్న రష్యా.. చమురు శుద్ధి ఫ్యాక్టరీలే ఉక్రెయిన్ టార్గెట్

Exit mobile version