Site icon NTV Telugu

Aircraft: బీహార్ యువకుడి ఘనత.. రూ. 7,000 ఖర్చుతో.. స్క్రాప్‌ని ఉపయోగించి ఎగిరే విమానం తయారీ(వీడియో)

Avanish Kumar

Avanish Kumar

ట్యాలెంట్ ఒకరి సొత్తు కాదని నిరూపించాడు బీహార్ కుర్రాడు. తన ఆలోచనలతోనే అద్భుతాన్ని ఆవిష్కరించాడు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని ఏకంగా ఎగిరే విమానాన్ని తయారు చేశాడు. అతడే బీహార్ కు చెందిన అవనీష్ కుమార్. డిగ్రీలు చదవకపోయినా టెక్నికల్ స్కిల్స్ ను పెంపొందించుకుని ఎవరూ ఊహించని ఆవిష్కరణకు తెరలేపాడు. సైంటిస్టులు సైతం ఆశ్చర్యపోయేలా ఫ్లైట్ ను కళ్ల ముందు ఉంచాడు. విమానం తయారు చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.

Also Read:Pahalgam terrorists: పహల్గామ్ ముష్కరులు ఖతం.. హతమార్చిన భారత సైన్యం..

నిపుణులైన ఇంజనీర్స్ ల్యాబ్ లో ఎంతో శ్రమించి విమానాలను రూపొందిస్తుంటారు. కానీ అవనీష్ కుమార్ మాత్రం ఇవేమీ లేకున్నా.. కేవలం వారం రోజుల్లోనే రూ. 7 వేల ఖర్చుతో పనికిరాని వస్తువులను ఉపయోగించి ఎగిరే విమానాన్ని ఆవిష్కరించాడు. దానిని విజయవంతంగా ప్రయోగించాడు. అవనీష్ స్వయంగా నడిపాడు. ప్రయోగ సమయంలో పదుల సంఖ్యలో యువకులు అక్కడికి చేరుకుని వీక్షించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఎగిరే విమానాన్ని తయారు చేసిన అవనీష్ పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు బీహార్ యువకుడు.

Exit mobile version