Khazana jewellery robbery: 100 కోట్ల బంగారం టార్గెట్.. బీహార్ గ్యాంగ్ ప్లాన్
- మొత్తం ఏడుగురు సభ్యులు గల ముఠా
- రెండేళ్ల క్రితం నుంచి జగద్గిరిగుట్టలో మకాం
- 10 షాపులపై రెక్కీ చేసి ఖజానాను ఎంచుకున్న గ్యాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khazana jewellery robbery: హైదరాబాద్ చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ షోరూమ్‌లో చోరీ చేసిన దొంగలు బీహార్ గ్యాంగ్‌గా గుర్తించారు. అంతే కాదు సిగాన్, సారన్ గ్యాంగులుగా చెబుతున్నారు పోలీసులు. గతంలో వీళ్లపై 10 చోరీ కేసులతోపాటు పలు పోలీస్ స్టేషన్లలో హత్య కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆగస్టు 12న ఖజానా జ్యువెలరీలో చోరీకి ముహూర్తం ఖరారు చేసిన చోరీ గ్యాంగ్.. అంతకు రెండు రోజుల ముందే పక్కా ప్లాన్ రెడీ చేశారు. అదే రోజు ఉదయం షాపులోకి ఎంట్రీ ఇచ్చి కేవలం 3 నిముషాల్లో పని ముగించుకుని బయటపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుపై ఒకరు వెళితే మరొకరు సంగారెడ్డి నుంచి జహీరాబాద్ మీదుగా వెళ్లిపోయారు. తాము తెచ్చుకున్న బైక్‌లను మధ్యలోనే వదిలిపెట్టారు. ఆరుగురు సభ్యులకు ఒక్కొక్కరిగా విడిపోయి.. ఒకసారి బీదర్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి పూణేకి వెళ్లిపోయారు. పూణేలో మీట్ అయిన తర్వాత కొంత బంగారం ఒకరి దగ్గర పెట్టి మిగతా బంగారంతో పాటు 4 తుపాకులు తీసుకొని ముగ్గురు బీహార్‌కి వెళ్లారు. బీదర్‌లో సైబరాబాద్ పోలీసులు ఒకరిని పట్టుకోగా మిగతా వాళ్లని పూణేలో పట్టుకున్నారు. వాళ్ల దగ్గర నుంచి వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
READ MORE: Amaravati: అమరావతి నిర్మాణంలో అత్యంత కీలక పరిణామం
Also Read
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
10 కిలోల గోల్డ్ ఆభరణాలు ఎత్తుకుపోయామని దొంగల సంబరం
అంతా బాగానే ఉంది.. కానీ ఖజానా జ్యువెలరీలో చోరీ చేసిన సొమ్ము గోల్డ్ కోటెడ్‍తో కూడిన వెండి ఆభరణాలు అనే విషయం వారికి తెలియదు. దాదాపు 10 కిలోల గోల్డ్ ఆభరణాలు ఎత్తుకుపోయామని దొంగలు సంబర పడ్డారు. దాని విలువ 20 కోట్ల రూపాయలు ఉంటుందని అనుకున్నారు. నిజానికి ఖజానా జ్యువెలరీలో రూ. 100 కోట్లకు పైగా బంగారం ఉంటుందని తెలిసి రెక్కీ చేసి మరీ ప్లాన్ చేశారు. కానీ వారి మేనేజర్ లాకర్ కీస్ మర్చిపోవడంతో వాళ్ల ప్లాన్ కాస్తా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు పడ్డారని మరో నలుగురి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.బీహార్ గ్యాంగ్‌కు టెక్నికల్ విషయాల్లో ఎవరో సాయం చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ చేసిన వారితోపాటు వారిని కూడా పట్టుకుంటామని చెబుతున్నారు.
READ MORE: Chiranjeevi : నా కెరీర్ లో స్టాలిన్ ఎంతో ప్రత్యేకం.. చిరు ఎమోషనల్
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!