Site icon NTV Telugu

Khazana jewellery robbery: 100 కోట్ల బంగారం టార్గెట్.. బీహార్ గ్యాంగ్ ప్లాన్

8

8

Khazana jewellery robbery: హైదరాబాద్‌ చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ షోరూమ్‌లో చోరీ చేసిన దొంగలు బీహార్ గ్యాంగ్‌గా గుర్తించారు. అంతే కాదు సిగాన్, సారన్ గ్యాంగులుగా చెబుతున్నారు పోలీసులు. గతంలో వీళ్లపై 10 చోరీ కేసులతోపాటు పలు పోలీస్ స్టేషన్లలో హత్య కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆగస్టు 12న ఖజానా జ్యువెలరీలో చోరీకి ముహూర్తం ఖరారు చేసిన చోరీ గ్యాంగ్.. అంతకు రెండు రోజుల ముందే పక్కా ప్లాన్ రెడీ చేశారు. అదే రోజు ఉదయం షాపులోకి ఎంట్రీ ఇచ్చి కేవలం 3 నిముషాల్లో పని ముగించుకుని బయటపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుపై ఒకరు వెళితే మరొకరు సంగారెడ్డి నుంచి జహీరాబాద్ మీదుగా వెళ్లిపోయారు. తాము తెచ్చుకున్న బైక్‌లను మధ్యలోనే వదిలిపెట్టారు. ఆరుగురు సభ్యులకు ఒక్కొక్కరిగా విడిపోయి.. ఒకసారి బీదర్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి పూణేకి వెళ్లిపోయారు. పూణేలో మీట్ అయిన తర్వాత కొంత బంగారం ఒకరి దగ్గర పెట్టి మిగతా బంగారంతో పాటు 4 తుపాకులు తీసుకొని ముగ్గురు బీహార్‌కి వెళ్లారు. బీదర్‌లో సైబరాబాద్ పోలీసులు ఒకరిని పట్టుకోగా మిగతా వాళ్లని పూణేలో పట్టుకున్నారు. వాళ్ల దగ్గర నుంచి వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

READ MORE: Amaravati: అమరావతి నిర్మాణంలో అత్యంత కీలక పరిణామం

10 కిలోల గోల్డ్ ఆభరణాలు ఎత్తుకుపోయామని దొంగల సంబరం
అంతా బాగానే ఉంది.. కానీ ఖజానా జ్యువెలరీలో చోరీ చేసిన సొమ్ము గోల్డ్ కోటెడ్‍‌తో కూడిన వెండి ఆభరణాలు అనే విషయం వారికి తెలియదు. దాదాపు 10 కిలోల గోల్డ్ ఆభరణాలు ఎత్తుకుపోయామని దొంగలు సంబర పడ్డారు. దాని విలువ 20 కోట్ల రూపాయలు ఉంటుందని అనుకున్నారు. నిజానికి ఖజానా జ్యువెలరీలో రూ. 100 కోట్లకు పైగా బంగారం ఉంటుందని తెలిసి రెక్కీ చేసి మరీ ప్లాన్ చేశారు. కానీ వారి మేనేజర్ లాకర్ కీస్ మర్చిపోవడంతో వాళ్ల ప్లాన్ కాస్తా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు పడ్డారని మరో నలుగురి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.బీహార్ గ్యాంగ్‌కు టెక్నికల్ విషయాల్లో ఎవరో సాయం చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ చేసిన వారితోపాటు వారిని కూడా పట్టుకుంటామని చెబుతున్నారు.

READ MORE: Chiranjeevi : నా కెరీర్ లో స్టాలిన్ ఎంతో ప్రత్యేకం.. చిరు ఎమోషనల్

Exit mobile version