Site icon NTV Telugu

Bihar Elections 2025: ‘చావోరేవో’ దశలోకి బీహార్ ఎన్నికలు.. ఎవరికీ లైఫ్‌లైన్, ఎవరికీ ఫినిష్ లైన్!

Bihar Elections 2025

Bihar Elections 2025

Bihar Elections 2025: బీహార్ ఎన్నికలలో రెండవ దశ ఓటింగ్ కొన్ని ప్రాంతీయ పార్టీలకు చావోరేవోగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వాస్తవానికి బీహార్ రెండవ దశ ఎన్నికల్లో అనేక అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ పోటీలో ఉన్న చిన్న పార్టీల విజయ అవకాశాలు ఏకంగా ఎన్నికల ఫలితాన్ని మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పెద్ద పార్టీల వ్యూహాల మధ్య, హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM), వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (VIP), రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM), AIMIM వంటి పార్టీలు తమ ఉనికిని నిరూపించుకోడానికి విశేషంగా ప్రయత్నిస్తున్నాయి.

READ ALSO: Vida VX2 Go: విడా VX2 Go కొత్త వేరియంట్ విడుదల.. 3.4 kWh బ్యాటరీ.. సింగిల్ ఛార్జ్ తో 100KM రేంజ్

హిందుస్తానీ అవామ్ మోర్చా
బీహార్ రెండవ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM) కు చాలా కీలకం. ఆ పార్టీ ఇమామ్‌గంజ్, బారాచట్టి, టికారి, అత్రి, సికంద్ర, కుటుంబ నియోజకవర్గాలలో పోటీ చేస్తోంది. ఈ ప్రాంతాలలో HAM కు బలమైన పట్టు ఉంది. మాంఝీ కోడలు దీపా మాంఝీ ఇమామ్‌గంజ్ నుంచి, ఆయన వదిన జ్యోతి మాంఝీ బారాచట్టి నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో పార్టీ విజయం సాధించి NDAలో తన స్థానాన్ని నిలబెట్టుకోవడంపై పార్టీ ప్రత్యేక దృష్టిసారించింది. ఈ ఎన్నికల్లో సాధించే స్థానాలతో భవిష్యత్ రాజకీయాల్లో గొప్ప పాత్ర పోషించవచ్చని పార్టీ ఆశిస్తోంది.

వికాస్షీల్ ఇన్సాన్ పార్టీ
రెండవ దశ ఓటింగ్ వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ అధినేత ముఖేష్ సాహ్నికి రాజకీయంగా కీలకమైనదిగా భావిస్తున్నారు. సాహ్నికి మహా కూటమి ఉప ముఖ్యమంత్రి పదవిని హామీ ఇచ్చింది. కాబట్టి ఆయన పార్టీ పనితీరు ఈ స్థానాన్ని దక్కించుకునే అవకాశాలతో నేరుగా ముడిపడి ఉందని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. వీఐపీ దాదాపు 15 స్థానాల్లో పోటీ చేస్తోంది. సాహ్ని మొదట్లో 40 నుంచి 50 సీట్లు డిమాండ్ చేశారు. పార్టీకి నిషాద్ కమ్యూనిటీలో గణనీయమైన పట్టు ఉంది, సాహ్ని ఎక్కువగా ఈ ఓటు బ్యాంకుపై ఆధారపడుతున్నారు. బీహార్ జనాభాలో 36 శాతం మంది అత్యంత వెనుకబడిన తరగతులు (EBC) కు చెందినవారు. ఈ సమాజంలో సాహ్ని పార్టీ తన పట్టును బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. రెండవ దశలో VIP బాగా పనిచేస్తే, మహా కూటమిలో దాని స్థానం, భవిష్యత్తులో పోటీ చేసే స్థానాల సంఖ్య మరింత బలపడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నేషనల్ పీపుల్స్ ఫ్రంట్
ఈ దశ ఉపేంద్ర కుష్వాహా రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM) కు కూడా కీలకం. RLM ఆరు సీట్లలో పోటీ చేస్తోంది, వాస్తవానికి ఈసారి పార్టీ ప్రభావం అది గెలిచే సీట్ల సంఖ్య కంటే దాని ఓట్ల విభజన సామర్థ్యాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉపేంద్ర కుష్వాహా కోయరి (కుష్వాహా) కమ్యూనిటీకి చెందిన ప్రముఖ నాయకుడు. ఆయన మద్దతు అనేక నియోజకవర్గాలలో నిర్ణయాత్మక పాత్ర పోషించవచ్చని అంటున్నారు. కుష్వాహా భార్య స్నేహలత ససారాం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె విజయం లేదా ఓటమి పార్టీ నైతికతను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. NDAలో కుష్వాహా పాత్ర ఈ దశ ఫలితాలపై ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్
బీహార్ ఎన్నికలలో రెండవ దశ అసదుద్దీన్ ఓవైసీ పార్టీ AIMIM కి కూడా చాలా కీలకం. ముఖ్యంగా సీమాంచల్ ప్రాంతంలో AIMIM కిషన్‌గంజ్, అరారియా, పూర్ణియా వంటి ముస్లింలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో పోటీ చేస్తోంది. 2020 ఎన్నికలలో ఈ పార్టీ బీహార్‌లో ఐదు సీట్లను గెలుచుకుంది, ఇప్పుడు ఆ ప్రదర్శనను పునరావృతం చేయాలని యోచిస్తుంది. AIMIM ముస్లిం ఓట్లను ఏకీకృతం చేసి రాష్ట్రంలో తనను తాను ప్రధాన శక్తిగా నిలబెట్టుకోవాలని చూస్తోంది. పార్టీ వ్యూహం అభివృద్ధి, విద్య, అణగారిన వర్గాల సాధికారతపై దృష్టి పెట్టింది. సీమాంచల్‌లో AIMIM పనితీరు భవిష్యత్తులో బీహార్ రాజకీయాల్లో పార్టీ శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకోగలదా లేదా అనేది నిర్ణయిస్తుంది.

రెండవ దశ ఓటింగ్ ఈ పార్టీల మనుగడకు ముడిపడి ఉన్నాయి. HAM, VIP వంటి పార్టీలు పొత్తులలో తమ స్థానాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా, RLM, AIMIM వంటి పార్టీలు తమ స్వతంత్ర గుర్తింపు, రాజకీయ ప్రభావాన్ని నొక్కి చెప్పడానికి చూస్తున్నాయి. వాస్తవానికి ఈ ఫలితాలు బీహార్ రాజకీయాల్లో పైన పేర్కొన్న పార్టీలు పోషించే రాజకీయమైన పాత్రను నిర్ణయిస్తాయి.

READ ALSO: Tariff Dividend: అమెరికన్లకు ట్రంప్ గిఫ్ట్.. ‘టారిఫ్ డివిడెండ్’ పేరుతో సర్‌ప్రైజ్ ప్యాకేజ్!

Exit mobile version