Site icon NTV Telugu

Bihar: నేడు మంత్రి వర్గం రద్దు.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..?

Bihar Elections

Bihar Elections

Bihar: బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 243 మంది సభ్యులు గల అసెంబ్లీలో 202 స్థానాలను గెలుచుకుని, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అఖండ మెజారిటీని సాధించింది. నూతన ప్రభుత్వం, మంత్రివర్గ ఏర్పాటుకు సంబంధించి ఎన్డీఏ పార్టీల మధ్య ఢిల్లీ, పాట్నాలో సమావేశాలు జరుగుతున్నాయి. ఇంతలో ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్లు అధికారికంగా ప్రకటిస్తూ, ఎన్నికల కమిషన్ బృందం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల పూర్తి జాబితాను గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌కు సమర్పించింది.

READ MORE: Sree Leela : నడుము ఒంపులతో హీటెక్కిస్తున్న శ్రీలీల

బీహార్ ప్రధాన ఎన్నికల అధికారి వినోద్ సింగ్ గుంజ్యాల్, భారత ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ ఆనంద్ బృందంతో కలిసి రాజ్ భవన్ కు చేరుకుని గవర్నర్‌కు ఈ ముఖ్యమైన పత్రాన్ని అందించారు. దీంతో అక్టోబర్ 6 నుంచి అమలులో ఉన్న మోడల్ ప్రవర్తనా నియమావళి ఈరోజు సాయంత్రం 5 గంటలకు నిష్ఫలమైంది. మోడల్ ప్రవర్తనా నియమావళి ఎత్తివేయడంతో ప్రభుత్వ, కొత్త పథకాల ప్రకటనలు, అధికారుల బదిలీలు ఇప్పుడు తిరిగి ప్రారంభమవుతాయి. ఎన్నికల సమయంలో నిలిచిపోయిన అనేక ప్రాజెక్టులు ఇప్పుడు ఊపందుకుంటాయి.

READ MORE: Ai Courses: ఉచిత AI కోర్సులను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం.. పూర్తి వివరాలు ఇవే

NDA మెజారిటీ సాధించడంతో నితీష్ కుమార్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమైంది. అయితే, మంత్రివర్గంలో మిత్రపక్షాల భాగస్వామ్యం, మంత్రిత్వ శాఖల పంపిణీకి సంబంధించి ఢిల్లీలో తీవ్రమైన సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇంతలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేడు (సోమవారం) ఉదయం 11:30 గంటలకు క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రివర్గాన్ని రద్దు చేయాలనే నిర్ణయాన్ని ఆమోదిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌కు తన రాజీనామాను సమర్పించి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం పాట్నాలోని గాంధీ మైదానంలో జరుగుతుంది. ప్రధాని మోడీ కూడా హాజరవుతారు. భద్రతా కారణాలు, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సన్నాహాల దృష్ట్యా పాట్నా జిల్లా యంత్రాంగం నవంబర్ 17 నుంచి 20 వరకు గాంధీ మైదాన్‌ను మూసివేయాలని నిర్ణయించింది. అంటే.. నవంబర్ 17, 20 మధ్య ఏ రోజునైనా కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయవచ్చని అర్థం. ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ప్రమాణ స్వీకారానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Exit mobile version