Biggest Iphone 15 Scam Revealed by India Post : ఐఫోన్ 15కి సంబంధించిన ఒక పెద్ద స్కామ్ వెలుగులోకి వస్తోంది. ఇండియన్ పోస్టల డిపార్ట్మెంట్ కొత్త ఐఫోన్ 15 స్కామ్ గురించి వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద ఉన్న తపాలా శాఖ ట్విట్టర్(X) ప్లాట్‌ఫారమ్‌లోని తన అధికారిక ఖాతా ద్వారా ఈ స్కామ్ గురించి వినియోగదారులకు తెలియజేసింది. ఇండియా పోస్ట్ లక్కీ విన్నర్స్‌కి కొత్త ఐఫోన్ 15 ఇస్తున్నట్లు ఒక పిషింగ్ మెసేజ్ వైరల్ అవుతోంది. దాన్ని షేర్ చేసి ఇండియా పోస్ట్ ట్వీట్ చేసింది, “దయచేసి జాగ్రత్తగా ఉండండి! ఇండియా పోస్ట్ ఏదైనా అనధికారిక పోర్టల్ లేదా లింక్ ద్వారా ఎలాంటి బహుమతిని ఇవ్వదు. ఇండియా పోస్ట్‌కు సంబంధించిన ఏదైనా సమాచారం కోసం, దయచేసి అధికారిక వెబ్‌సైట్‌ను Indiapost.gov .in కు వెళ్లి సందర్శించండి.. ”
iPhone 13 Price Drop: ₹52,499కే ఐఫోన్ 13.. కొనాలనుకున్న వారు డోంట్ మిస్!
ఇక ఒక వ్యక్తి నవరాత్రి కానుకగా iPhone 15ని గెలుచుకున్నట్లు తెలిపే వైరల్ మెసేజ్ స్క్రీన్‌షాట్ కూడా ఈ పోస్టులో ఉంది. ఇక ఈ బహుమతిని ఎలా క్లెయిమ్ చేయాలనే దానిపై కూడా సూచనలు అందించబడ్డాయి. వాట్సాప్‌లోని 5 గ్రూపులు లేదా 20 మంది స్నేహితులకు మెసేజ్ షేర్ చేస్తే బహుమతిని క్లెయిమ్ చేసేందుకు లింక్ ఇస్తారని అందులో పేర్కొన్నారు. ఇక ఈ మెసేజ్ ఫేక్ అని, అలాంటి మెసేజ్‌లను ఫార్వార్డ్ చేయవద్దని ఇండియా పోస్ట్ హెచ్చరించింది. అక్కడే కొన్ని అనధికార లింక్‌లు ఇవ్వబడ్డాయి, వీటిపై క్లిక్ చేయడం మానుకోవాలని సూచించింది. స్కామర్లు గతంలో ప్రభుత్వ వెబ్‌సైట్‌లను ఉపయోగించి హానికరమైన దాడులకు పాల్పడ్డారు. ఆధార్ అప్‌డేట్, పాన్ అప్‌డేట్, రివార్డ్‌లను క్లెయిమ్ చేయడానికి లింక్‌లతో వచ్చే బ్యాంక్ సంబంధిత మెసేజ్‌లతో సహా అనేక సందేశాలతో డబ్బులు కొట్టేసేవారు.
ఎవరైనా ఈ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత, వినియోగదారుని మసాజర్ వెబ్‌సైట్‌కి తీసుకెళ్లి వారి డబ్బు దోచేసేవారు. iPhone 15 వంటి స్కామ్‌ల నుండి సురక్షితంగా ఉండటానికి, లింక్‌పై క్లిక్ చేయమని మిమ్మల్ని కోరుతూ వచ్చే మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండండి. స్కామర్‌లు తరచుగా ప్రజలను మోసం చేయడానికి ఎప్పటికప్పుడు ట్రెండింగ్ టాపిక్‌లను ఉపయోగిస్తారు, కాబట్టి మీరు iPhone 15 గురించి సందేశాన్ని చూసినట్లయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. నమ్మదగిన స్టోర్ అలాగే ధృవీకరించబడిన ఇ-కామర్స్ వెబ్‌సైట్‌ల నుండి మాత్రమే Apple iPhoneలను కొనుగోలు చేయాలని గుర్తుంచుకోండి.