BiggBoss 8 : బిగ్ బాస్ సీజన్ 8లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది. ఆల్రెడీ శనివారం ఓ ఎలిమినేషన్ పూర్తయి తేజ హౌస్ నుంచి బయటికి వచ్చేశాడు. మొత్తంగా ఈ వారం రోహిణి తప్ప మిగతా కంటెస్టెంట్లు అందరూ నామినేషన్లలో ఉన్నారు. అయితే శనివారం నాటి ఎపిసోడ్ లో అవినాష్ ని సేఫ్ చేసి అతను గెలుచుకున్న టికెట్ టు ఫినాలె ద్వారా సీజన్ 8 ఫస్ట్ ఫైనలిస్ట్ గా ప్రకటించారు హోస్ట్ నాగార్జున. అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ షీల్డ్ ఇచ్చే ప్రాసెస్ లో సాంగ్ తో అతడిని.. తన ఆటని మెచ్చుకున్నారు. అదే క్రమంలో హోస్ట్ నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో గోల్డెన్ టికెట్, బ్లాక్ టికెట్ ఇచ్చారు. గోల్డెన్ టికెట్ కేవలం నిఖిల్, గౌతమ్, రోహిణిలకు రాగా.. మిగతా అందరికీ బ్లాక్ టికెట్ వచ్చింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చెప్పడంతో ఇంకా హౌస్ లో నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
Read Also:Hyderabad: గచ్చిబౌలిలో భారీగా గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్
అయితే ఆదివారం నాటి ఎపిసోడ్ కూడా షూటింగ్ పూర్తి కాగా బయటకు వచ్చిన బిగ్ బాస్ లీకుల ప్రకారం ఈ వారం ఎలిమినేట్ అయిన రెండో కంటెస్టెంట్ ఎవరో తెలిసి పోయింది. ఈ వారం రెండో కంటెస్టెంట్ గా స్ట్రాంగ్ అనుకున్న పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. సీజన్ 8 లో టాస్కుల్లో తన స్ట్రాంగ్ అని నిరూపించుకున్నాడు పృధ్వి. ఐతే అతను టాస్కులు బాగా ఆడినా సరే మిగతా విషయాల్లో అతడు చాలా వెనుకబడి ఉన్నాడు. ముఖ్యంగా టాస్కుల్లో అతను తన ఆవేశంతో కంటెస్టెంట్లను టార్గెట్ చేస్తూ కొన్ని బూతులు కూడా మాట్లాడారు. అఫ్కోర్స్ నాగార్జున చెప్పిన తర్వాత కొంత మార్చుకున్నాడు. ఏదైనా గొడవ అయితే అతను అవతల వారి మీద మీదకు వెళ్తాడు. ఇలా పృథ్వీ మీద చాలా నెగిటివ్ నెస్ పెరిగింది. ఐతే హౌస్ లో అందరితో కన్నా విష్ణు ప్రియతో ఎక్కువ క్లోజ్ గా ఉన్నాడు. మిగతా కంటెస్టెంట్స్ ని పట్టించుకోలేదు. ఈ కారణాల వల్ల ఈ వారం పృథ్వీ ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఐతే పృధ్వి ఎలిమినేషన్ విష్ణు ప్రియకు షాక్ ఇస్తుందని అంతా భావిస్తున్నారు. హౌస్ లో ఆమె పృథ్వీతో బాగా కనెక్ట్ అయ్యింది. ఇక పృథ్వీ బయటకు వెళ్లిపోవడంతో టాప్ 5 పొజిషన్ లో మార్పులు వస్తాయి. ఇప్పటికే అవినాష్ టాప్ 5 లో ప్లేస్ దక్కించుకోగా మిగిలిన నలుగురు ఎవరన్నది త్వరలో తెలియనుంది.
Read Also:Upcoming Smart Phones: డిసెంబర్ నెలలో రాబోయే టాప్ బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్స్ ఇవే