Bigg Boss 7 Grand Finale :బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ రైతు బిడ్డదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ముగింపు దశకు చేరుకుంది.గ్రాండ్ ఫినాలే కోసం ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చేసింది. బిగ్ బాస్ 7 విజేత ఎవరో మరికొద్ది సేపట్లో తెలిసిపోనుంది.బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఎంతో గ్రాండ్ గా ప్రారంభం అయింది. బిగ్ బాస్ సీజన్ 7టైటిల్ కోసం అర్జున్, ప్రశాంత్, శివాజీ, ప్రిన్స్ యావర్, అమర్ దీప్ మరియు ప్రియాంక పోటీ పడుతున్నారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఫైనల్ కి చేరిన 6 గురిలో అత్యధిక ఓట్లు సాధించిన ప్రల్లవి ప్రశాంత్ కే బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ దక్కింది.. అయితే చివరి వరకు శివాజీ,అమర్ గట్టి పోటీ ఇవ్వగా విజేతగా మాత్రం పల్లవి ప్రశాంత్ నిలిచాడు. దీనితో బిగ్ బాస్ లో తొలిసారి ఈ ఘనత సాధించిన సామాన్యుడిగా ప్రశాంత్ రికార్డ్ సృష్టించారు.
పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవడంతో అతడికి 50 లక్షల నగదుతో పాటు మారుతి కారు మరియు 15 లక్షల విలువైన బంగారం దక్కనుంది. పల్లవి ప్రశాంత్ సామాన్యుడిగా హౌస్ లోకి అడుగుపెట్టాడు. హౌస్ లో వున్న వారందరితో ఎన్ని ఇబ్బందులు తలెత్తిన కూడ ప్రశాంత్ ఎప్పుడూ ఎక్కడా వెనకడుగు వేయలేదు. ముఖ్యంగా అమర్ దీప్ తో హౌస్ లో ప్రశాంత్ కి సమస్యలు వస్తున్నప్పటికీ ప్రశాంత్ వీలైన మేరకు ఎంతో కూల్ గా డీల్ చేస్తూ ఎంతో చక్కగా తన గేమ్ ను ఆడాడు.. ప్రతి టాస్క్ ను ఎంతో చక్కగా పూర్తి చేసాడు.దీనితో క్రమంగా ప్రశాంత్ గురించి ఆడియన్స్ చర్చించుకుంటూ వచ్చారు.అలాగే హౌస్ శివాజీ సపోర్ట్.. అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంకలతో జరిగిన గొడవలు పల్లవి ప్రశాంత్ కి పాజిటివ్స్ గా మారాయి. రైతు బిడ్డ అనే సెంటిమెంట్ పల్లవి ప్రశాంత్ కు బాగా వర్కౌట్ అయింది. అందుకు తగ్గట్లుగానే ప్రశాంత్ హౌస్ లో మాట్లాడుతూ వచ్చాడు. దీనితో ఆడియన్స్ రైతు బిడ్డకి ఓట్లు గుద్దేశారు. మొత్తంగా పల్లవి ప్రశాంత్ సామాన్యుడిగా హౌస్ లోకి ఎంట్రీ వచ్చి బిగ్ బాస్ 7 టైటిల్ గెలుచుకున్నాడు..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..