Site icon NTV Telugu

Bigg Boss Telugu 9: 12వ వారం కెప్టెన్సీ టాస్క్‌లో ఘర్షణలు.. పవన్–రీతూ ఎమోషనల్‌ మోమెంట్స్ హైలైట్‌

Bigg Boss 9 Telugu

Bigg Boss 9 Telugu

‘బిగ్‌బాస్ తెలుగు 9’ సీజన్ 12వ వారం క్లైమాక్స్ దశలోకి అడుగు పెట్టడంతో హౌజ్‌లో గేమ్, భావోద్వేగాలు, వ్యూహాలు పీక్స్‌కి చేరాయి. ఈ వారం ఎలిమినేషన్‌పై ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరగగా, మరోవైపు కెప్టెన్సీ కోసం హౌజ్‌మేట్స్ మధ్య జోరుగా పోరు సాగుతోంది. కెప్టెన్ పదవికి ఇమ్మాన్యుయెల్, సంజనా, దివ్య, రీతూ, కళ్యాణ్, డీమాన్ పవన్ పోటీ దారులు గా నిలిచారు. టాస్క్ ప్రారంభమైన వెంటనే హౌజ్‌లో పలు విభేదాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా సంజన–రీతూ, రీతూ–దివ్య మధ్య జరిగిన ఘర్షణలు తీవ్ర వాతావరణాన్ని సృష్టించాయి. రీతూ తనను టాస్క్‌ నుంచి తప్పించిందని ఆగ్రహించిన సంజనా, చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు హౌజ్‌లో టెన్షన్ మరింత పెంచాయి. ఇంకో వైపు పవన్‌ తనను పోటీలోనుంచి బయటకు నెట్టాడని భావించిన ఇమ్మాన్యుయెల్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కెప్టెన్సీ టాస్క్ మొత్తం హౌజ్‌లో హీట్‌ను మరింత పెంచి, భావోద్వేగాలు, ఆగ్రహాలు, వ్యూహాలన్నీ పీక్స్‌కు చేరాయి.

Also Read : Aishwarya Rajinikanth : ఆయన సహాయానికి ఎప్పటికీ రుణపడి ఉంటా..

చివరి రౌండ్‌లో కెప్టెన్సీ రేస్ డీమాన్ పవన్ vs కళ్యాణ్ మధ్యకు చేరింది. ఈ రౌండ్‌లో ‘రోడ్డు నిర్మాణం’ అనే టాస్క్ ఇవ్వగా, కంకర–ఇసుక మోసి గుంతలు పూడ్చాల్సి వచ్చింది. టాస్క్‌లో శారీరక ఒత్తిడి పెరగడంతో పవన్‌కు తీవ్రమైన వెన్నునొప్పి రావడంతో టాస్క్ పూర్తి చేయడం కష్టంగా మారింది. పవన్ బాధపడుతున్న దృశ్యాలు చూసిన రీతూ చౌదరీ కన్నీళ్లు పెట్టుకోవడం, అతనిపై చూపిన ఆందోళన హౌజ్‌లోనే కాక, సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశమైంది. పవన్–రీతూ బాండింగ్‌పై సంజనా చేసిన కామెంట్స్ కూడా హౌజ్‌లో కొత్త వివాదాన్ని రేపాయి. అయితే రీతూ పవన్‌పై చూపిన కేర్, ఆమె భావోద్వేగాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

విమర్శలు ఎదుర్కొంటూనే, తన ఆటతో రీతూ క్రమంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఎదుగుతోందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ప్రస్తుతం హౌజ్‌లో తనూజ, కళ్యాణ్, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయెల్, రీతూ, సంజన, భరణి, సుమన్ శెట్టి, దివ్య ఉన్నారు. రీతూ తప్ప మిగతా వారందరూ నామినేషన్‌లో ఉన్నారు. ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇందులో దివ్య ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 12వ వారం ముగింపు దశలోకి వెళ్లిన క్రమంలో, బిగ్‌బాస్ హౌజ్‌లో గేమ్ మరింత ఆసక్తికరంగా మారి ప్రేక్షకుల ఉత్కంఠను పెంచుతోంది.

Exit mobile version