NTV Telugu Site icon

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ అదిరిపోయే ట్విస్ట్.. సోనియా ఎలిమినేట్.. బలి కానున్న మణికంఠ!

Sonia

Sonia

Bigg Boss Telugu 8: తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రస్తుతం ఐదో వారంలోకి అడుగు పెట్టింది. తాజాగా నాలుగో వారం సంబంధించి ఇంటి నుంచి సోనియా ఎలిమినేట్ అయ్యింది. ఆవిడ ఎలిమినేట్ అయిన తర్వాత సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ ఊపొందుకున్నాయి. అయితే అసలు ఏం జరిగింది..? ఎందుకు సోనియా బయటికి వెళ్లాల్సి వచ్చిందన్న విషయం గురించి చూస్తే.. రెగ్యులర్గా ఈ కార్యక్రమాన్ని ఫాలో అవుతున్న వారికి సోనియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందంతో మాత్రమే కాకుండా ఆటలు ఆడడం కూడా సోనియాకి చాలా ప్లస్ అని అనుకోవచ్చు. కాకపోతే., అదే సమయంలో ఆమెకు ఈ బిగ్ బాస్ షో కల్చర్ సెట్ అవ్వలేదని కూడా చెప్పవచ్చు. ప్రతిచోట రాజకీయం ఉన్నట్లే.. బిగ్ బాస్ హౌస్ లో కూడా కుల్లు రాజకీయాలకు కేరా అడ్రస్ గా మారింది. ఇక మూడు వారాలు బాగానే ఆడిన.. కట్ చేస్తే ఇప్పుడు నాలుగో వారాంతంలో ఎవరు ఊహించని విధంగా సోనియా ఎలిమినేట్ అయింది. నిజానికి ఆవిడకు ఈ కార్యక్రమంలో ఎలాంటి ఆటను క్లారిటీ లేకుండా పోయింది.

Urvashi Rautela : బాలయ్య బండారం బయటపెట్టిన బాలీవుడ్ బ్యూటీ

ఇకపోతే., మరోవైపు సోషల్ మీడియాలో అబ్బా సాయిరాం.. సోనియా ఎలిమినేట్ అయ్యింది పోయిందా? షోకి పీడ విరగడైందని., బిగ్ బాస్ హౌస్ కు పట్టిన దరిద్రం ఇంతటితో పోయిందంటూ కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా నిఖిల్ కి మంచి రోజులు వచ్చాయని, అలాగే పృథ్వి ఆట కూడా మెరుగుపడుతుందంటూ డిస్కషన్ మొదలుపెట్టేశారు. దీనికి కారణం లేకపోలేదు. అన్న, తమ్ముడు అంటూ వారిని సోనియా వల్లో పడుకోబెట్టడం.. అప్పుడప్పుడు హగ్గులు ఇవ్వడం, ముద్దులు పెట్టడం లాంటివి చూడలేకపోతున్నామని సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ చేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే సోనియా పై ఆడియన్స్ లో ఎంత నెగిటివ్ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

Show comments