NTV Telugu Site icon

Bigg Boss Telugu 7: మారని శోభా తీరు… అర్జున్ పై రెచ్చిపోయిన లేడీ విలన్..

Shobha Arjun

Shobha Arjun

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తొమ్మిదో వారంలోకి అడుగు పెట్టింది..కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక రోజ్, శుభశ్రీ, నయని పావని, పూజ మూర్తి వరుసగా ఎలిమినేట్ అయ్యారు. నిన్న ఎనిమిదో వారంకు గాను ఆట సందీప్ హౌస్ నుంచి బయటకు వచ్చారు..శోభా శెట్టి-సందీప్ తక్కువ ఓట్లతో డేంజర్ జోన్ లోకి వచ్చారు. ఉత్కంఠ మధ్య సందీప్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఇంటి సభ్యుల మీద తనకున్న పాజిటివ్, నెగిటివ్ ఒపీనియన్స్ చెప్పి సందీప్ బిగ్ బాస్ వేదిక వీడాడు. ఇక సోమవారం వచ్చిందంటే నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. 9వ వారం నామినేషన్స్ లిస్ట్ లీకైంది. 8 మంది లిస్ట్ లో ఉన్నట్లు సమాచారం. తేజ, అమర్ దీప్, శోభ, ప్రియాంక, భోలే, రతిక, యావర్, అర్జున్ నామినేట్ అయ్యారు..

ఇక సోమవారం కావడంతో హౌస్లో నామినేషన్స్ మొదలయ్యాయి.. ఇంటి సభ్యులు కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలి.. గతవారం యావర్ పై రెచ్చిపోయిన శోభా ఈరోజు ఎపిసోడ్ మాత్రం అర్జున్ పై నిప్పులు చెరిగింది.. అర్జున్ ఈసారి శోభాను నామినేట్ చేశాడు. మజాక్ మనకేమో కానీ ప్రేక్షకులకు కాదు. ఇప్పటి నుండైనా చూసి ఆడు అని చెప్పాడు. దానికి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు అంటూ ఫైర్ అయ్యింది. బిగ్ బాస్ అర్జున్ ని తీసుకొస్తాను. బ్లాక్ కలర్ రెడీ చేసుకో అని పొగరుగా మాట్లాడింది. శోభా శెట్టికి నాగార్జున శనివారం వార్నింగ్ ఇచ్చాడు.

యావర్ ని పిచ్చోడు అనడంతో అది సరికాదని హెచ్చరించాడు. నువ్వు టెంపర్ కోల్పోతున్నావు. అప్పుడు ఏది పడితే అది మాట్లాడుతున్నావని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.. అది చెప్పి ఒక్కరోజు కూడా అవ్వక ముందే మళ్లీ అలానే చేసింది.. ఇక 9వ వారం నామినేషన్స్ లిస్ట్ లీకైంది. 8 మంది లిస్ట్ లో ఉన్నట్లు సమాచారం. తేజ, అమర్ దీప్, శోభ, ప్రియాంక, భోలే, రతిక, యావర్, అర్జున్ నామినేట్ అయ్యారట. వీరిలో ఒకరు హౌస్ వీడనున్నారనేది సమాచారం. ఈ వారం సందీప్ ఎలిమినేటైన విషయం తెలిసిందే… వచ్చేవారం శోభా ఎలిమినేట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.