Site icon NTV Telugu

Bigg Boss Telugu 7: ఈ వారం నామినేషన్ లో ఎవరున్నారో తెలుసా?

Bigg Boss77

Bigg Boss77

బిగ్ బాస్ 7 రసవత్తరంగా సాగుతుంది.. ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ కొనసాగుతుంది.. ఈ వారం నామినేషన్ లో ఉన్నవారి గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. ఈసారి కెప్టెన్సీ, లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌లాంటివి ఏమీ పెట్టడం లేదు. కెప్టెన్సీకి బదులుగా పవరాస్త్రను ప్రవేశపెట్టారు.. గత సీజన్ లోగా ఈసారి టాస్క్ లు అస్సలు లేవని చెప్పాలి.. ఇక ఏదో ఆనవాయితీ ఉన్నట్లుగా ప్రతివారం అమ్మాయిలే ఎలిమినేట్‌ అవుతూ వస్తున్నారు. అలా ఇప్పటివరకు కిరణ్‌ రాథోడ్‌, షకీల, దామిని, రతికా రోజ్‌.. ఇలా వరుసగా నలుగురు ఇంటి నుంచి బయటకు వచ్చారు..

ఐదోవారం బిగ్ బాస్ లో నామీనేషన్స్ వేడెక్కుతుంది.. ఇక శివాజీ చేస్తున్న అతికిగానూ తనకిచ్చిన పవరాస్త్రను తిరిగి వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే..దీంతో నేటి నామినేషన్స్‌లో హౌస్‌మేట్స్‌ అతడిపై విరుచుకుపడ్డారు. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. గౌతమ్‌ కృష్ణ.. ఓ టాస్క్‌లో తేజ తనను బెల్ట్‌తో కొట్టిన సంగతిని గుర్తు చేశాడు.. తేజ బెల్ట్ తో కొడుతున్నప్పుడు తనని ఆపలేదని అతన్ని నామినేట్ చేసినట్లు చెప్పాడు.. దాంతో అందరు గౌతమ్ ను సపోర్ట్ చేసినట్లు తెలుస్తుంది..

సందీప్‌ కంటెస్టెంట్‌గా ఉండుంటే తనకే నామినేట్‌ చేసేవాడినని, కానీ తను హౌస్‌మేట్‌ అయినందున తనను నామినేట్‌ చేసే ఛాన్స్‌ లేదన్నాడు. ప్రియాంక.. శివాజీ, యావర్‌ను నామినేట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ వారం సందీప్‌, శోభా శెట్టి, ప్రశాంత్‌ మినహా మిగతా ఏడుగురూ నామినేషన్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఎవరు ఎవర్ని నామినేట్‌ చేశారో రేపటి ఎపిసోడ్ లో తెలుస్తుంది.. ఈ వారం అమర్ దీప్ ఎలిమినేట్ అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ వారం ఎవరు బయటకు వెళ్తారో తెలియాలంటే బిగ్ బాస్ ను తప్పక ఫాలో అవ్వాల్సిందే..

Exit mobile version