Site icon NTV Telugu

Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ గా టీవీ నటి, యాంకర్

Untitled Design (4)

Untitled Design (4)

బిగ్ బాస్ మలయాళ సీజన్ -7 విన్నర్ గా టైటిల్‌ను ప్రముఖ టెలివిజన్ నటి అనుమోల్ సొంతం చేసుకుంది. ఈ షోకు హోస్ట్ గా మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఉన్నారు. అయితే.. గ్రాండ్ ఫినాలేలో విన్నర్ ను ప్రకటించారు మోహన్ లాల్. అనుమోల్ 42.5 లక్షల నగదు బహుమతి, ఒక సరికొత్త SUV, ప్రతిష్టాత్మక బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్నారు.

Read Also: Cash Found in Smuggler’s House: ఓ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు.. లెక్కపెట్టలేక అలసిపోయిన పోలీసులు

అయితే ఇక్కడ కామనర్ అనీష్ మాత్రం రెండో స్థానాన్ని సంపాదించుకున్నారు. షానవాస్ , నెవిన్, అక్బర్ వరుసగా మూడవ, నాల్గవ, ఐదవ స్థానాల్లో నిలిచారు. ఈ విజయంతో అనుమోల్ బిగ్ బాస్ మలయాళ చరిత్రలో రెండవ మహిళా విజేతగా నిలిచింది. ఈ షో విజేతగా ఇక్కడ నిలబడటం చాలా సంతోషంగా, గర్వంగా ఉందని అనుమోల్ కన్నీటి పర్యంతమయ్యారు. దేవునికి, తన కుటుంబానికి, మద్ధతు తెలిపిన ఆడియన్స్ అందరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

Read Also:Inter-Caste Marriage: ఇంటర్ కాస్ట్ మ్యార్యేజ్ చేసుకుంటే….మరీ ఇంత దారుణమా…

ఒకప్పుడు, తాను లాలెట్టన్‌ను కూడా కలవలేకపోయానని.. ఇప్పుడు తాను గర్వంగా ఆయన దగ్గర నిలబడి కౌగిలించుకోగలిగానన్నారు అనుమోల్. ప్రారంభంలో ఈ సీజన్‌కు ప్రైజ్ మనీని రూ. 50 లక్షలుగా ప్రకటించారు. కానీ దానిలో కొంత భాగాన్ని తరువాత బిగ్ బ్యాంక్ టాస్క్ విజేతలకు పంపిణీ చేశారు. దీనితో తుది విజేత బహుమతి రూ. 42.5 లక్షలకు చేరుకుంది.

Exit mobile version