Site icon NTV Telugu

Bigg Boss 9 Telugu: ఈ వారం నో ఎలిమినేషన్ నా..?

Bigg Boss9

Bigg Boss9

తెలుగు బిగ్ బాస్‌ లో ఈ వారం ఫ్యామిలీ మెంబర్స్‌, సెలబ్రిటీ గెస్టులతో సందడిగా గడిచిపోయింది. ఇక సుమన్ చేసిన పొరపాటు, తనూజ టెన్షన్ కారణంగా కెప్టెన్సీ అవకాశాన్ని కోల్పోయినా, రీతూ కెప్టెన్‌గా గెలిచింది. మరోవైపు, తనూజ–దివ్య మధ్య జరిగిన గొడవ వీకెండ్ ఎపిసోడ్‌కు హైలైట్ అయింది. దివ్యకి ఇంకా ఆ గొడవ ప్రభావం తగ్గకపోవడంతో, “బయటకు వెళ్లాక నీ ముఖం చూడను” అంటూ తనూజపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎదవిదిగా ఈ వీక్ ఎండ్ లో స్టేజీపై నాగార్జున ఇద్దరినీ క్లాస్ తీసుకుంటూ, గొడవలో ఎవరి తప్పు ఏంటో స్పష్టంగా చెప్పాడు.

Also Read : Mahavatar Narasimha : 98వ ఆస్కార్ రేసులో.. ‘మహావతార్ నరసింహా’..

తరువాత ఫ్యామిలీ మెంబర్స్‌ను స్టేజీపైకి పిలిచి, తమ టాప్ 5 అభిప్రాయం చెప్పే అవకాశం ఇచ్చారు. ఇందులో భాగంగా..భరణి తల్లి, నాగబాబు, కళ్యాణ్ తండ్రి, ఇమ్మాన్యుయేల్ అన్న, అవినాష్, దివ్య తాతయ్య వచ్చి వారు తమ దృష్టిలో ఉన్న టాప్ కాంటెస్టెంట్స్‌ను వరుసగా పేర్కొన్నారు. ఇక అందరి లిస్ట్ లో కూడా దివ్యను చివర్లో పెట్టడం షాకింగ్ అనే చెప్పాలి.

చివరకు ఆమె తాతయ్య కూడా “ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి” అని సూచిస్తూ దివ్వ ను చివర్లోనే పెట్టాడు. అయితే ఈ వారం దివ్య–తనూజ గొడవ కారణంగా షో TRPs భారీగా పెరిగినట్లు సమాచారం. దీంతో బిగ్ బాస్ టీమ్ ఈ వారం ఎలిమినేషన్ లేకుండా కొనసాగించే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్. TRP కోసం ఈ ఇద్దరినీ మరికొంచెం హౌస్‌లో ఉంచాలని నిర్ణయించినట్లు ఛానల్ వర్గాల్లో బజ్. అసలు ఈ వారం నిజంగా నో ఎలిమినేషన్సా? అని తెలుసుకోవడానికి ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version