NTV Telugu Site icon

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ హౌస్‌లో దసరా సెలబ్రేషన్..చివరికి అదిరిపోయే ట్విస్ట్..

Bigg Boss 7 Dasara

Bigg Boss 7 Dasara

బిగ్ బాస్ ఏడోవారం కాస్త రసవత్తరంగా మారింది.. ఈ వారం బిగ్ బాస్ విచిత్రమైన టాస్క్ లను కూడా ఇచ్చాడు.. దాంతో జనాల్లో ఆసక్తి క్రమంగా పెరుగుతుంది.. వీకెండ్ వస్తే నాగ్ చేసే హంగామా షోకు హైలెట్ అవుతుంది.. వారం జరిగిన తప్పులను ఎత్తి చూపిస్తూ ఒక్కొక్కరిని కడిగి పడేస్తాడు.. అలాగే నిన్న శనివారం కావడంతో కింగ్ నాగార్జున హౌస్ లో ఉన్న వారికి క్లాస్ తీసుకున్నారు వారం మొత్తం లో జరిగిన విషయాలు గురించి మాట్లాడుతూ.. క్లాస్ తీసుకున్నాడు.. దాంతో అందరు తెల్ల మొహాలు వేశారు..

అలాగే హౌస్ లో ఎవరు ఎవరికీ నిచ్చెన, పాము అని ఓ గేమ్ ఆడించారు నాగార్జున. ఇందులో ఒకొక్కరు తమకు సపోర్ట్ చేసే వారిని నిచ్చెన అని.. నచ్చని వారిని పాము అని అందుకు రీజన్స్ కూడా చెప్పాలని చెప్పాడు నాగ్. అశ్విని .. గౌతమ్- శోభా, గౌతమ్.. అర్జున్-శివాజీ, శివాజీ.. యవర్- అమరదీప్, అమరదీప్.. అర్జున్- తేజ, అర్జున్.. గౌతమ్-శివాజీ, యవర్.. శివాజీ- గౌతమ్, పూజా.. అర్జున్- అశ్విని, ప్రియాంక.. శోభా- అశ్విని,భోలె.. శివాజీ- శోభాశెట్టి, శోభాశెట్టి.. ప్రియాంక- భోలె, సందీప్.. శోభా- శివాజీ, తేజ.. అమరదీప్- యవర్, ప్రశాంత్.. శివాజీ- పూజా అని చెప్పుకొచ్చారు… ఇదిలా ఉండగా.. ఈరోజు ఎపిసోడ్ ను బిగ్ బాస్ తాజాగా రిలీజ్ చేశారు..

బిగ్ బాస్ హౌస్ లో ఈరోజు దసరా సంబరాలు అంబరాన్ని అంటాయి.. నాగ్ కొంతమంది సెలబ్రెటీలతో డాన్స్ పర్ఫామెన్స్ చేయించాడు. హీరోయిన్స్ డింపుల్ హయతి, పాయల్ రాజ్ పుత్ తమ డాన్స్ లతో ఆకట్టుకున్నారు. ఇక హౌస్ లో ఉన్న వారితో గేమ్స్ ఆడించాడు నాగ్. అలాగే హౌస్ లో ఉన్న వారికి తన ఇంటివారు రాసిన లెటర్స్ ను పంపించారు. ఈ లెటర్స్ చదువుతూ అందరూ ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా శోభా శెట్టి, తేజ, యావర్ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక లాస్ట్ లో అసలైన ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. ఇక ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ ను మిస్ అవ్వకుండా చూడాల్సిందే..