NTV Telugu Site icon

Bigg Boss 7 Telugu : ఈ వారం నామినేషన్ లో ఎవరెవరు ఉన్నారో తెలుసా?

Bigg Boss7 (4)

Bigg Boss7 (4)

బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ షో మొదలై ఆల్రెడీ వారం రోజులు పూర్తయింది.. మొదటి ఎలిమినేషన్ కూడా పూర్తయ్యింది.. ఇప్పుడు అందరి దృష్టి రెండోవారం నామినేషన్ మీద ఉంది.. ఇక రెండో వారంలో మొదటి రోజు నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. నామినేషన్స్ కి ముందు సందీప్ కి ఇచ్చిన VIP రూమ్ లోకి అందరూ వచ్చారు.. ఇకపోతే ఆ రూమ్ చూస్తామంటూ వచ్చి కొంతమంది అక్కడే పడుకున్నారు. రతిక ఇక్కడ ఎలా ఉంటారు అడగమని సందీప్ ని రెచ్చగొట్టింది. అనంతరం నామినేషన్స్ ప్రక్రియ మొదలవ్వగా ఈ సారి బిగ్‌బాస్ కొంచెం డిఫరెంట్ గా నామినేషన్స్ చేయించాడు..

ఎలిమినేషన్ ప్రకారం ప్రతి వారం ఒకరు వచ్చి ఎవరెవర్ని నామినేట్ చేస్తున్నారో చెప్పేవాళ్ళు. కానీ ఈ సారి ఒకరు వచ్చి నిలబడితే వాళ్ళని ఎవరెవరు నామినేట్ చేయాలి అనుకుంటున్నారో చెప్పాలి. అలా ఒక బాక్స్ గీసి అందులో ఒక్కొక్క కంటెస్టెంట్స్ ని నిలబెట్టారు. మిగిలిన వాళ్లలో అతన్ని ఎవరెవరు నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పాలి. నామినేట్ చేయగానే బాక్స్ లో నిల్చున్న వారి మీద కలర్ వాటర్ పడతాయి.. గతవారం సందీప్ పవర్ అస్త్ర ను గెలుచుకున్న సంగతి తెలిసిందే..అతను ఒకర్ని డైరెక్ట్ గా నామినేట్ చేయొచ్చు అని చెప్పగా ప్రిన్స్ ని నామినేట్ చేశాడు. దీంతో ప్రిన్స్ – సందీప్ మధ్య కాసేపు గొడవ జరిగింది. ఇక ప్రిన్స్ ని ఇంకెవరూ నామినేట్ చేయకూడదు అని బిగ్‌బాస్ చెప్పాడు.

ఇకపోతే ఈ వారం నామినేషన్ ను చూస్తే..తేజ వచ్చి నిల్చోగా.. అతన్ని శుభశ్రీ, ప్రశాంత్, రతిక నామినేట్ చేశారు. ఆ తర్వాత బాక్స్ లోకి దామిని రాగా.. ఆమెని ఎవరూ నామినేట్ చేయలేదు. దీంతో దామిని హ్యాపీ అయింది. ఆ తర్వాత శివాజీ రాగా.. అతన్ని అమర్ దీప్, ప్రియాంక జైన్, షకీలా, శోభాశెట్టి, దామిని.. మొత్తం అయిదుగురు నామినేట్ చేశారు.
ఆ తర్వాత ప్రశాంత్ ని.. గౌతమ్, అమర్ దీప్, షకీలా, తేజ, దామిని, ప్రియాంక.. ఏకంగా ఆరుగురు నామినేట్ చేశారు. దీంతో ప్రశాంత్ అందరితో గొడవ పెట్టుకున్నాడు. ఇక బయట ప్రశాంత్ కి ఫుయిల్ నెగిటివిటి ఉన్న సంగతి తెలిసిందే. రైతు బిడ్డ అని చెప్పుకుంటూ అతను ఎదగడానికి రైతుల పేరు వాడుకొని మోసం చేస్తున్నాడని కామెంట్స్ ఎప్పట్నుంచో వస్తున్నాయి, అలాగే బిగ్‌బాస్ కి అడుక్కొని వచ్చాడని అందరూ అంటూనే ఉన్నారు.. ఇక హౌస్ లో తర్వాత కూడా అందరు అలానే అంటున్నారు.. నిన్న సగం మంది నామినేట్ అవ్వగా, ఇవ్వాల సగం మందిని నామినేట్ చేయనున్నారు..

Show comments