NTV Telugu Site icon

Bigg Boss 7 Telugu: ఎలిమినేషన్‌ ఎత్తేసిన బిగ్‌బాస్‌.. ఆ ముగ్గురి కోసమేనా?

Bb11week

Bb11week

బిగ్ బాస్ సీజన్ 7.. వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే.. హౌస్ మేట్స్ లో ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది.. ఇక నిన్న శనివారం కూడా నాగ్ అందరిని ఎంటర్టైన్ చెయ్యడంతో పాటుగా.. అందరికీ క్లాస్ పీకాడు.. ముందుగా హౌస్ పెద్ద దిక్కు అయిన శివన్నకు నాగ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఎలిమినేషన్ చూస్తే ఈ వారం ఎవరు మూటాముళ్లె సర్దుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అందులోనూ బిగ్‌బాస్‌ ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ప్రవేశపెట్టడం.. అది యావర్‌ గెల్చుకోవడంతో ఎలిమినేషన్‌ మరింత ఉత్కంఠగా మారింది.

కానీ బిగ్‌బాస్‌ తలిచింది వేరు.. ఆ పాస్‌ లేడీ కంటెస్టెంట్‌ గెలుచుకోవాలని ప్రయత్నించాడు.. దానికి కూడా యావర్ ను నువ్వు ఆడింది నిజామా.. అంటూ షాక్ ఇచ్చాడు నాగ్.. దీంతో తనది ఫౌల్‌ గేమ్‌ అని ఒప్పుకుని ప్రిన్స్‌ తన పాస్‌ను వెనక్కు ఇచ్చేశాడు.. ఇక ఈ వారం నామినేషన్స్ కూడా బాగానే జరిగాయి.. శివాజీ, ప్రశాంత్‌ తప్ప మిగిలిన అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో అమర్‌దీప్‌, ప్రిన్స్‌ యావర్‌, గౌతమ్‌, ప్రియాంక సేఫ్‌ జోన్‌లో ఉన్నారు.

రీఎంట్రీ తర్వాత పెద్దగా ప్రభావం చూపని రతిక ఎలిమినేట్‌ కానుందని ప్రచారం జరిగింది. కానీ చివర్లో అశ్విని, శోభాలలో ఎవరో ఒకరిని బయటకు పంపించనున్నట్లు టాక్‌ సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తుంది.. ఇవేవీ కాదని బిగ్‌బాస్‌ అనూహ్య ట్విస్ట్‌ ఇచ్చాడు. ఎలిమినేషన్‌ ఎత్తేశాడు. ఈవారం ఎవరినీ బయటకు పంపించలేదు. అమ్మాయిలను హౌస్‌లో ఉంచడానికే బిగ్‌బాస్‌ ఈ ప్లాన్‌ వేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది.. ఇక ఈ విషయం కూడా నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.. మొత్తానికి ఈ వారం అందరు సేఫ్ అయ్యినట్లే అని తెలుస్తుంది..