Site icon NTV Telugu

Bigg Boss 19: డ్రామాక్రేజీ కాదు.. ‘డెమోక్రేజీ’ అంటున్న బిగ్ బాస్ హోస్ట్!

Bigg Boss 19

Bigg Boss 19

Bigg Boss 19: బిగ్ బాస్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న.. హిందీ బిగ్ బాస్ 19వ సీజన్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ప్రతి సీజన్‌ లాగే ఈసారి కూడా సల్మాన్ ఖాన్ కొత్త థీమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.దీనితో ప్రజల్లో బిగ్ బాస్ ఆసక్తిని రెట్టింపు చేశారు. తాజాగా విడుదల చేసిన బిగ్ బాస్ 19 ట్రైలర్ లో.. ఈసారి షో కేవలం “డ్రామాక్రేజీ” కాకుండా “డెమోక్రాజీ” కానుందని ప్రకటించారు.

Kantara Chapter1: క‌న‌క‌వ‌తి వ‌చ్చేసింది.. కాంతార‌ నుండి రుక్మిణి బ్యూటి ఫుల్ లుక్

ఇక ట్రైలర్‌లో సల్మాన్ ఖాన్ ఒక లీడర్‌ వేషధారణలో కనిపిస్తారు. ఆయన ఒక ఎన్నికైన ప్రతినిధుల సభలా కనిపించే ఓ ఇంటిలోకి ప్రవేశించి, ఈ సీజన్‌ను “ఘర్వాలో కీ సర్కార్” (హౌస్‌మేట్స్ ప్రభుత్వం) నడపనుందని ప్రకటిస్తారు. ప్రతి చిన్నా – పెద్దా నిర్ణయం హౌస్‌మేట్స్ చేతిలో ఉంటుందని అన్నారు. అయితే, ఒక ట్విస్ట్‌గా ఏ ప్రభుత్వమూ ప్రజలకంటే పై స్థాయిలో ఉండదని (“అవామ్”) చెప్పి, తమ చర్యలకు హౌస్‌మేట్స్ ఫలితాలు అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరిస్తారు. బిగ్ బాస్ 19 ఈ ఏడాది ఆగస్ట్ 24 నుంచి జియో హాట్‌స్టార్‌లో ప్రారంభం కానుంది. ఈసారి తాజా ఎపిసోడ్లు ముందుగా OTTలో విడుదలై, గంటన్నర తర్వాత కలర్స్ టీవీలో ప్రసారం అవుతాయి.

Deva Katta : ‘మయసభ’.. బోలెడన్ని ప్రశంసలు.. కొన్ని విమర్శలు

ఓ నివేదిక ప్రకారం, ఈ సీజన్‌కి సల్మాన్ ఖాన్ పారితోషికం సుమారు 120 కోట్లు పైనే ఉంటుందని సమాచారం. ప్రతి వరన్తరం సమయంలో షో ను హోస్ట్ చేయడానికి ఆయన 8 కోట్లు పొందుతారని సమాచారం. అలా మొత్తం 15 వారాల పాటు షో నిర్వహించనున్నారు. బిగ్ బాస్ 19 ప్రధానంగా OTT (జియో హాట్‌స్టార్)లో ప్రసారమై, అదే రోజు కొంత సమయం తర్వాత టీవీలో (కలర్స్‌ టీవీ) రిపీట్ అవుతుంది. ఈసారి గత సీజన్‌లతో పోలిస్తే షో బడ్జెట్ తక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సీజ్ సంబంధించి గౌతమీ కపూర్, ధీరజ్ ధూపర్, అలీషా పన్వార్, ఖుషీ దూబే, గౌరవ్ తనేజా, మిస్టర్ ఫైజు, అపూర్వా ముఖిజా, పూరవ్ ఝా, గౌరవ్ ఖన్నా, ధనశ్రీ వర్మ, శ్రీరామ్ చంద్, అర్షిఫా ఖాన్, మిక్కీ మేకోవర్ వంటి పలువురు ప్రముఖులను షో కోసం సంప్రదించినట్లు టాక్.

Exit mobile version