Gold Price : బంగారం ప్రియులకు భారీ ఊరట లభించింది. నూతన సంవత్సరంలో నెల రోజుల పాటు వరుసగా బంగారం ధర పెరిగి రికార్డు స్థాయికి చేరింది. తులం బంగారం 84 వేల రూపాయల మార్కులు సైతం దాటింది. సోమవారం పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్ లభించింది. బంగారం ధర తగ్గి కాస్త కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించింది.
Read Also:Electric Bikes: అడ్వాన్స్డ్ ఫీచర్లతో.. బెస్ట్ స్టైలిష్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే
10గ్రాముల బంగారం కు సోమవారం 440 రూపాయలు తగ్గింది. శని, ఆదివారాల్లో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం 77,450 రూపాయలు ఉండగా సోమవారం ఒక్కరోజే 400రూపాయలు తగ్గి 77,050రూపాయలుగా ఉంది. 24 క్యారెట్స్ 10గ్రా బంగారం 84,490రూపాయలు ఉండగా సోమవారం 440తగ్గి 84,050రూపాయలు ఉంది.
Read Also:Komatireddy Venkat Reddy : డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి గొప్పతనం మాటల్లోనే చెప్పుకునేది కాదు
హైదరాబాదులో 10 గ్రాముల (తులం) బంగారం 22 క్యారెట్స్ 77,050 ఉండగా 24 క్యారెట్ 10 గ్రాముల (తులం) బంగారం 80,050 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం మార్కెట్ ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఉన్నాయి. ఇక పోతే వెండి ధరలు కిలోకు రూ.1,07,000గా కొనసాగుతుంది.