NTV Telugu Site icon

Viral Video: ఓరి నాయనో.. ఎంత పెద్ద పాము.. చూస్తే భయంతో వణికిపోతారు..

Big Python

Big Python

మొన్నీమధ్య కర్ణాటకలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది.. ఆ తర్వాత ఇప్పుడు అంతకన్నా పెద్ద కొండచిలువ ఆస్ట్రేలియాలో కనిపించింది.. దాన్ని చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.. ఆ భారీ కొండచిలువకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ ప్రాంతంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. దానిని చూసిన స్ధానికులు భయభ్రాంతులకు గురయ్యారు. భారీ కొండచిలువ వీడియో వైరల్ అవుతోంది…

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ పరిసర ప్రాంతంలో 16 అడుగుల భారీ కొండచిలువ కనిపించడంతో స్ధానికులు భయాందోళనలకు గురయ్యారు. ఇంటి పైకప్పు మీదుగా కదులుతున్నట్లుగా కనిపించడంతో అసలు అది అక్కడికి ఎలా వచ్చిందో తెలియక ఆశ్చర్యపోయారు. ఆ ప్రాంతంలోని జనమంతా దానిని చూడటానికి గుమిగూడారు.. అక్కడ ఉండే ఓ వ్యక్తి ఆ పామును వీడియో తీశారు.. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు..

కొండచిలువ ఇంటి పై కప్పునుంచి పాకుతూ ఎత్తైన చెట్ల మీదకు వెళ్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఇక్కడ కొండచిలువలు రకరకాల పాములు కనిపించడం సర్వసాధారణమట.. కార్పెట్ పైథాన్, డైమండ్ పైథాన్ వంటి వివిధ రకాల కొండచిలువలు సాధారణంగా ఆగ్నేయ ఆస్ట్రేలియన్ రాష్ట్రాల్లో కనిపిస్తాయి. ప్రముఖ ఆస్ట్రేలియన్ స్నేక్ రాంగ్లర్ ‘స్నేక్ క్యాచర్ డాన్’ యాహూ న్యూస్ ఆస్ట్రేలియాతో మాట్లాడుతూ, వీడియోలో చూసినట్లుగా, కార్పెట్ పైథాన్‌లు వాటి సమానంగా పంపిణీ చేయబడిన కండరాలను ఉపయోగించి చెట్లను కొలవగలవని చెప్పారు.. ఇలా పెద్ద పెద్దవి అక్కడ ఉంటాయి.. ప్రస్తుతం ఈ భారీ కొండచిలువ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..