Site icon NTV Telugu

Big Nude Boat: ఇక్కడ ఎవ్వరూ బట్టలు ధరించరు..! ఆడ, మగ ఎవరైన సేమ్ రూల్స్..?

Nacked Boat

Nacked Boat

Big Nude Boat: ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతూనే ఉంటాయి. వాటిలో కొన్నింటి గురించి మనకు తెలియదు. వాటిలో నేకెడ్ పడవ ప్రయాణం ఒకటి. అవును.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇలాంటి ఓ పడవ ఉంది. ప్రస్తుతం ఈ ఓడ గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. ఇది అన్ని షిప్‌లాగా కాదు.. ఇందులో ప్రయాణికులు బట్టలు లేకుండా ప్రయాణిస్తారు. అలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 11 రోజులు ఎంజాయ్ చేస్తారు. ప్రస్తుతం ఈ కాస్లీ ప్రయాణానికి ఆదరణ పెరుగుతోంది. ఇంతకీ.. ఈ కథేంటో ఇప్పుడు చూద్దాం…

READ MORE: Amit Shah: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అమిత్‌షా తీవ్ర ఆరోపణలు..

న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. బట్టలు లేకుండా సెలవులు గడపడానికి ఇష్టపడే ప్రయాణ ప్రియులు బేర్ నెసెసిటీస్‌తో తమ జీవితాన్ని స్వేచ్ఛగా గడపవచ్చు. బేర్ నెసెసిటీస్ అనేది క్రూయిజ్‌లలో బట్టలు లేకుండా ఎంజాయ్ చేసే వ్యక్తుల కోసం ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసే పర్యాటక సంస్థ. ఈ ట్రిప్ కు వెళ్లే వ్యక్తులు 13,000 నుంచి 50,000 డాలర్లు అంటే 13 లక్షల నుంచ 43 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 968 అడుగుల పొడవున్న ఈ షిప్ పేరు “ది బిగ్ న్యూడ్ బోట్”. ఈ షిప్ లో బట్టలు లేకుండా సరదాగా గడిపే వ్యక్తులు 11 రోజులు కరేబియన్ సముద్రంలో ప్రయాణిస్తారు. బిగ్ న్యూడ్ బోట్‌లో 11 రోజుల పాటు నగ్నంగా ప్రయాణించవచ్చు. ఈ నార్వేజియన్ పెర్ల్ బోట్ అమెరికా తీరంలో భాగమైన మియామీ నుంచి కరేబియన్ ఐస్ లాండ్ కు బయలుదేరుతుంది.

READ MORE: Nandamuri-taraka-rama-rao : అప్పట్లోనే పాన్-ఇండియా ఆఫర్‌ను తిరస్కరించిన NTR..

దుస్తులు ధరించనప్పటికీ అనే నియమ నిబంధనలు పెట్టింది కంపెనీ.. క్రూయిజ్ ట్రిప్‌లో క్రీడలు, వినోదం, ఈత కొట్టేటప్పుడు బట్టలు లేకుండా ఉంటే ఎటువంటి సమస్య లేదు. కానీ, విందు, భోజనం కోసం ఫలహారశాలలో ప్రైవేట్ భాగాలను కవర్ చేయడం తప్పనిసరి చేసింది. అలాగే మరొక వ్యక్తి శరీరాన్ని అనుచితంగా తాకడం నిషేధం. బహిరంగ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం నిషేధించారు. ఓడలోని అనేక భాగాల్లో “నో ఫోటో జోన్లు” కూడా ఉన్నాయి. పడవను ఒడ్డున ఆపినప్పుడు, స్థానికులు ఓడను చూడటానికి వచ్చినప్పుడు దుస్తులు ధరించాల్సి ఉంటుంది.

Exit mobile version