Kamal Hasan : విశ్వనటుడు కమలహాసన్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన “విక్రమ్” సినిమాతో పవర్ ఫుల్ కంబ్యాక్ ఇచ్చారు.అప్పటివరకు ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న కమల్ హాసన్ కు విక్రమ్ సినిమా బిగ్గెస్ట్ హిట్ అందించింది.ఈ సినిమాతో నిర్మాతగా కూడా కమల్ హాసన్ భారీగా లాభాలు అందుకున్నారు.ప్రస్తుతం కమల్ హాసన్ వరుసగా భారీ సినిమాలలో నటిస్తున్నారు.ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ఇండియన్ 2 “..స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.అలాగే ఎస్.జె .సూర్య ,సముద్రఖని ,బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
Read Also :Devara : దేవర ప్రీపోన్ వల్ల అన్ని కోట్లు లాభమా..?
ఈ సినిమాను మేకర్స్ జులై 12 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న “కల్కి 2898 AD “సినిమాలో కమల్ హాసన్ ముఖ్య పాత్రలో నటించారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.అలాగే కమల్ హాసన్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో “థగ్ లైఫ్ ” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు, గౌతమ్ కార్తీక్, దుల్కర్ సల్మాన్, జయం రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.పాపులర్ మాలీవుడ్ యాక్టర్ జోజు జార్జ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో ఐశ్వర్యలక్ష్మి, త్రిష, హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ చిత్రానికి ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.అలాగే తనకి విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన లోకేష్ కనగరాజ్ తో త్వరలో విక్రమ్ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు సమాచారం.ఇలా వరుసగా భారీ సినిమాలతో కమల్ దూసుకుపోతున్నారు.