సార్వత్రిక ఎన్నికల వేళ మరోసారి ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. మరింత మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన కాల్పుల్లో 29 మంది మృతిచెందగా.. మరోసారి భారీ స్థాయిలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Family Star : ఫ్యామిలీ స్టార్ కి అల్టిమేట్ పాజిటివ్ టాక్.. బ్రహ్మరథం పడుతున్న ఓటీటీ ఆడియన్స్
మంగళవారం ఉదయం నుంచి భారీ ఎన్‌కౌంటర్ జరుగుతోంది. నారాయణపూర్ జిల్లా అబుజ్‌మద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నక్సల్స్ సమావేశం అయ్యారన్న పక్కా సమాచారంతో నలువైపుల నుంచి రిజర్వ్‌డ్ పోలీసులు చుట్టుముట్టారు. ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో నలుగురు మావోలు ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్యపై మరింత సమాచారం రావాలి. కంకేర్ జిల్లాలోని ఛోటా బెథియాలో ఇటీవల 29 మంది మావోయిస్టులను హతం అయ్యారు.
ఇది కూడా చదవండి: New Rules From 1st May: గ్యాస్ సిలిండర్ నుంచి క్రెడిట్ కార్డ్ వరకు.. రేపటి నుంచి మారే రూల్స్ ఇవే
