NTV Telugu Site icon

Rajasthan: రాజస్థాన్ లో భర్తపై ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న భార్య

Rajasthan

Rajasthan

రాజస్థాన్ ఎన్నికల సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఓ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ దంతా రామ్‌గఢ్ అసెంబ్లీ స్థానంలో ఇద్దరు భార్యభర్తలు ఒకరిపై ఒకరు పోటీ చేసుకుంటున్నారు. జేజేపీ నుంచి రీటా చౌదరి పోటీ చేస్తుండగా.. ఆమె భర్త సిట్టింగ్ ఎమ్మెల్యే వరిందర్ సింగ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. కాగా, ఈ కుటుంబానికి కాంగ్రెస్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వరీందర్ సింగ్ తండ్రి నారాయణ్ సింగ్ 7 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పని చేశారు. వరీందర్ సింగ్ భార్య రీటా చౌదరి ఈ ఏడాది ఆగస్టులో జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)లో చేరారు. ఆ తర్వాత పార్టీ ఆమెను మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది.

Read Also: Medigadda Barrage: డివాటరింగ్ తరువాత నష్టంపై స్పష్టత ఇస్తాం.. కేంద్ర జలసంఘం సభ్యులు

రీటా చౌదరి అసెంబ్లీ ఎన్నికల్లో దంతా రామ్‌గఢ్ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంది.. కానీ, కాంగ్రెస్ ఆమెకు టిక్కెట్ ఇవ్వలేదు.. ఆమె భర్తకు ఇచ్చింది. దీంతో ఆమె జేజేపీ పార్టీలో జాయిన్ అయింది. ఇక, JJP తన అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేసింది.. ఇందులో దంతా రామ్‌గఢ్ నుంచి రీటా చౌదరి అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రీటా చౌదరి మాట్లాడుతూ.. నేను ప్రజల మధ్యనే ఉన్నాను.. వారికి అవసరమైనప్పుడు వారికి అండగా నిలిచాను అందుకే ప్రజలు నన్ను, నా నిర్ణయాన్ని అంగీకరించారు అని ఆమె తెలిపారు. ప్రజలు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వారు మార్పును కోరుకుంటున్నారు. అభివృద్ధి, నీటి సమస్య, నిరుద్యోగం తదితర అంశాలపై రీటా చౌదరి మాట్లాడుతూ.. ప్రజలకు కావాల్సిన నేను తీసుకు వస్తానంటూ ఆమె తెలిపారు. నవంబర్ 25న రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి.