James Bond 007 : జేమ్స్ బాండ్ 007 కావాలనుకుంటున్నారా అయితే రూ.8లక్షలు పెట్టాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
James Bond 007 : ప్రజలు తమ కలల కారును కొనుగోలు చేయడానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. అయితే కొంత మంది ఇంకా ముందుకు వెళ్లి తమ కార్లకు నంబర్ ప్లేట్లను లక్షల రూపాయలు పెట్టి కొంటున్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం అటువంటి VIP నంబర్ల కోసం క్రమం తప్పకుండా బిడ్లను ఆహ్వానిస్తుంది. ఇక్కడ ప్రతి నంబర్‌కు చాలా మంది పోటీదారులు ముందుకు వస్తారు. నంబర్ ప్లేట్ కోసం వేలం వేస్తారు. ఈ VIP నంబర్లలో జేమ్స్ బాండ్ సిరీస్ నంబర్ 001,002 నుండి నంబర్ 007 వరకు ఉంటాయి.
Read Also:Saindhav: చివరి 20 నిముషాలు… ముందెప్పుడూ చూసి ఉండరు
Also Read
- Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
- Junior Doctors: జూనియర్ డాక్టర్ల కీలక నిర్ణయం.. రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్..
- Tadipatri: తాడిపత్రిలో భగ్గుమన్న రాజకీయం.. కారు అద్దాలు ధ్వంసం..
- Snake bite: కానిస్టేబుల్‌ను కాటేసిన పాము.. AI సాయంతో దక్కిన ప్రాణాలు..
ఇటీవల నోయిడా లేదా UP16 కోసం వరుస VIP నంబర్లు విడుదల చేయబడ్డాయి. ఇందులో 001 నుంచి 009 నంబర్లకు బిడ్లు ఆహ్వానించగా, అందులో కొన్ని నంబర్ల వేలం రూ.8 లక్షలు దాటింది. ఒక నంబర్ కోసం 14 మంది పోటీదారులు ముందుకు వచ్చారు. ఈ బిడ్లలో విక్రయించబడిన అత్యంత ఖరీదైన సంఖ్య జేమ్స్ బాండ్ 007. ఇందుకోసం ఏడుగురు క్లెయింట్లు బిడ్లు వేయగా.. గరిష్టంగా రూ.8.75 లక్షల బిడ్ వచ్చింది. అదే విధంగా 001 అత్యధిక బిడ్‌ను పొందడం ద్వారా రెండో స్థానంలో నిలిచింది. దీనికి రూ.8.02 లక్షల బిడ్ రాగా, 14 మంది క్లెయిందారులు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు.
Read Also:Virat Kohli: బాబర్ అజామ్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ.. సత్తా చాటిన రోహిత్ శర్మ!
ఈ జాబితాలో అత్యధికంగా 002 నంబర్‌కు రూ.2.30 లక్షలు, 003 నంబర్‌కు రూ.1.61 లక్షలు, 004 నంబర్‌కు రూ.1.95 లక్షలు, నంబర్ 005కి రూ.6.44 లక్షలు, నంబర్ 006కి రూ.1 లక్షలు, నంబర్ 008కి రూ.3.76గా ఉంది. 009 నంబర్‌కు రూ. 6.08 లక్షల బిడ్ వచ్చింది. నోయిడా రవాణా శాఖ అటువంటి 340 VIP నంబర్లను జారీ చేసింది. వీటి కోసం బిడ్లను సమర్పించేందుకు ఆన్లైన్ ప్రక్రియను అనుసరించారు. ప్రజలు తమ బిడ్లను parivahan.inలో సమర్పించాల్సి ఉంది. బిడ్లు దాఖలు చేసేందుకు మరో రోజు సమయం ఉంది. ఇంతకు ముందు కూడా నోయిడాలో వీఐపీ నంబర్ ప్లేట్ల కోసం బిడ్లను ఆహ్వానించారు. అప్పుడు వీఐపీ నంబర్ల వేలం ధర రూ.15 లక్షలకు చేరుకుంది.
తాజావార్తలు
-
Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
-
Junior Doctors: జూనియర్ డాక్టర్ల కీలక నిర్ణయం.. రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్..
-
Bolla Brothers : పోలీసులకు ఇన్ఫోర్మర్లు.. లోపల గంజాయి దందా.. బొల్లా బ్రదర్స్ బాగోతం
-
Yash: ఆ స్టార్ హీరోయిన్ కోసం బాడీగార్డ్‌గా మారిన యశ్.. ‘టాక్సిక్’ షూటింగ్లో ఆసక్తికర ఘటన?
-
Tadipatri: తాడిపత్రిలో భగ్గుమన్న రాజకీయం.. కారు అద్దాలు ధ్వంసం..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?