Site icon NTV Telugu

James Bond 007 : జేమ్స్ బాండ్ 007 కావాలనుకుంటున్నారా అయితే రూ.8లక్షలు పెట్టాల్సిందే

New Project (52)

New Project (52)

James Bond 007 : ప్రజలు తమ కలల కారును కొనుగోలు చేయడానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. అయితే కొంత మంది ఇంకా ముందుకు వెళ్లి తమ కార్లకు నంబర్ ప్లేట్లను లక్షల రూపాయలు పెట్టి కొంటున్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం అటువంటి VIP నంబర్‌ల కోసం క్రమం తప్పకుండా బిడ్‌లను ఆహ్వానిస్తుంది. ఇక్కడ ప్రతి నంబర్‌కు చాలా మంది పోటీదారులు ముందుకు వస్తారు. నంబర్ ప్లేట్ కోసం వేలం వేస్తారు. ఈ VIP నంబర్లలో జేమ్స్ బాండ్ సిరీస్ నంబర్ 001,002 నుండి నంబర్ 007 వరకు ఉంటాయి.

Read Also:Saindhav: చివరి 20 నిముషాలు… ముందెప్పుడూ చూసి ఉండరు

ఇటీవల నోయిడా లేదా UP16 కోసం వరుస VIP నంబర్‌లు విడుదల చేయబడ్డాయి. ఇందులో 001 నుంచి 009 నంబర్లకు బిడ్లు ఆహ్వానించగా, అందులో కొన్ని నంబర్ల వేలం రూ.8 లక్షలు దాటింది. ఒక నంబర్ కోసం 14 మంది పోటీదారులు ముందుకు వచ్చారు. ఈ బిడ్లలో విక్రయించబడిన అత్యంత ఖరీదైన సంఖ్య జేమ్స్ బాండ్ 007. ఇందుకోసం ఏడుగురు క్లెయింట్లు బిడ్లు వేయగా.. గరిష్టంగా రూ.8.75 లక్షల బిడ్ వచ్చింది. అదే విధంగా 001 అత్యధిక బిడ్‌ను పొందడం ద్వారా రెండో స్థానంలో నిలిచింది. దీనికి రూ.8.02 లక్షల బిడ్ రాగా, 14 మంది క్లెయిందారులు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు.

Read Also:Virat Kohli: బాబర్‌ అజామ్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ.. సత్తా చాటిన రోహిత్‌ శర్మ!

ఈ జాబితాలో అత్యధికంగా 002 నంబర్‌కు రూ.2.30 లక్షలు, 003 నంబర్‌కు రూ.1.61 లక్షలు, 004 నంబర్‌కు రూ.1.95 లక్షలు, నంబర్ 005కి రూ.6.44 లక్షలు, నంబర్ 006కి రూ.1 లక్షలు, నంబర్ 008కి రూ.3.76గా ఉంది. 009 నంబర్‌కు రూ. 6.08 లక్షల బిడ్ వచ్చింది. నోయిడా రవాణా శాఖ అటువంటి 340 VIP నంబర్లను జారీ చేసింది. వీటి కోసం బిడ్‌లను సమర్పించేందుకు ఆన్‌లైన్ ప్రక్రియను అనుసరించారు. ప్రజలు తమ బిడ్లను parivahan.inలో సమర్పించాల్సి ఉంది. బిడ్‌లు దాఖలు చేసేందుకు మరో రోజు సమయం ఉంది. ఇంతకు ముందు కూడా నోయిడాలో వీఐపీ నంబర్ ప్లేట్ల కోసం బిడ్లను ఆహ్వానించారు. అప్పుడు వీఐపీ నంబర్ల వేలం ధర రూ.15 లక్షలకు చేరుకుంది.

Exit mobile version