NTV Telugu Site icon

Bhuvneshwar Kumar: చెలరేగిన భువీ.. 24 బంతుల్లో 20 డాట్ బాల్స్, 4 పరుగులు..

Bhuvneshwar Kumar

Bhuvneshwar Kumar

Bhuvneshwar Kumar in UP T20 League: టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం యూపీ టీ-20 లీగ్‌లో పాల్గొంటున్నాడు. తాజాగా ఈ లీగ్ లో కాశీ రుద్రతో జరిగిన మ్యాచ్‌ లో యూపీ ఫాల్కన్స్‌ కు చెందిన భువనేశ్వర్ కుమార్ విధ్వంసం సృష్టించాడు. నాలుగు ఓవర్ల స్పెల్‌లో ఒక మెయిడిన్‌ తో సహా కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. భువనేశ్వర్ కుమార్ నాలుగు ఓవర్ల స్పెల్‌లో 20 డాట్ బాల్స్ వేశాడు. అతని ప్రమాదకరమైన బౌలింగ్ కారణంగా, అతని జట్టు UP ఫాల్కన్స్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాశీ రుద్ర జట్టు 20 ఓవర్లలో కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలోని లక్నో ఫాల్కన్స్ 13.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.

Pregnant Women Food: గర్భిణీ స్త్రీలు ఈ ఆహారాలు అసలు తినకూడదు తెలుసా..?

ఈ మ్యాచ్‌ లో మొదటగా కాశీ రుద్ర జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ ముందు కాశీ రుద్ర బ్యాట్స్‌మెన్ నిస్సహాయంగా కనిపించారు. భువనేశ్వర్ కుమార్ కట్టుదిట్టమైన బౌలింగ్, అభినందన్ సింగ్ (03/31), కిషన్ కుమార్ సింగ్ (03/11) వికెట్లు సాధించడంతో కాశీ రుద్ర జట్టు 20 ఓవర్లలో కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. ప్రిన్స్ యాదవ్ 33 పరుగులు, ఘనశ్యామ్ ఉపాధ్యాయ్ 25 పరుగులు చేశారు. వీరుకాకుండా మరే ఇతర బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. ఇక స్వల్ప లక్ష్య ఛేదనలో సమర్థ్ సింగ్ 47 బంతుల్లో అజేయంగా 55 పరుగులు, విప్రజ్ నిగమ్ 21 బంతుల్లో అజేయంగా 26 పరుగులు చేయడంతో లక్నో ఫాల్కన్స్ 13.5 ఓవర్లలో విజయం సాధించింది.

Pigmentation: ఇలా చేస్తే మీ పిగ్మెంటేషన్ సమస్య తీరినట్లే..

ఇకపోతే భువనేశ్వర్ కుమార్ చాలా కాలంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. అతను చివరిసారిగా 2022లో న్యూజిలాండ్‌ తో భారత్ తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు. యూపీ టీ20 లీగ్‌లో ఈ ఆటతీరుతో మళ్లీ టీమ్ ఇండియాకు తలుపు తట్టాడు. భువనేశ్వర్ కుమార్ భారత్ తరఫున 87 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 90 వికెట్లు పడగొట్టాడు.