Site icon NTV Telugu

Bhutan Supports India UN: భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి: భూటాన్

Bhutan Supports India Un

Bhutan Supports India Un

Bhutan Supports India UN: భారత దేశానికి పొరుగు దేశం బాసటగా నిలిచింది. పొరుగు దేశాలు ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతుంటాయి.. అలాంటిది బాసటగా నిలవడం ఏంటని ఆలోచిస్తు్న్నారా.. మరేం లేదు పొరుగు దేశం భూటాన్ ఐక్యరాజ్యసమితిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని మాట్లాడింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) 80వ సమావేశంలో భూటాన్ ప్రధాన మంత్రి షెరింగ్ టోబ్గే భద్రతా మండలి (UNSC)లో ప్రధాన సంస్కరణల కోసం గట్టిగా మాట్లాడారు. మారుతున్న ప్రపంచ వాస్తవికతను దృష్టిలో ఉంచుకుని భారతదేశం, జపాన్ వంటి అర్హతగల దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ఈ డిమాండ్‌ను భారతదేశం చాలా కాలంగా లేవనెత్తుతుంది. ఇటీవల బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కూడా ఈ డిమాండ్‌కు ఆమోదం లభించింది.

READ ALSO: IND vs PAK Final: పన్నెండింటిలో నాలుగే.. టీమిండియాను కలవరపెడుతున్న రికార్డులు!

భారత్, జపాన్‌లకు అర్హత ఉంది..
UNSC కేవలం ప్రదర్శనగా ఉండకూడదని, ప్రపంచ వాస్తవ సవాళ్లను పరిష్కరించే ప్రభావవంతమైన శక్తిగా మారాలని భూటాన్ ప్రధాన మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. భద్రతా మండలి విస్తరణతో సహా UN సంస్కరణలకు భూటాన్ మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. సంస్కరించిన భద్రతా మండలిలో భారతదేశం, జపాన్ వంటి అర్హత గల ప్రముఖ దేశాలు ఉండాలని అన్నారు.

బ్రిక్స్ నుంచి కూడా భారత్‌కు మద్దతు..
UNSCలో భారతదేశం, బ్రెజిల్ గొప్ప పాత్ర పోషించాలనే డిమాండ్‌కు BRICS దేశాలు కూడా మద్దతు ఇచ్చాయి. ఈ సమయంలోనే భూటాన్ ప్రకటన రావడం.. వాటికి మరింత బలం చేకూర్చినట్లు అయ్యింది. ఇటీవల సమావేశంలో చైనా, రష్యా కూడా భారతదేశం, బ్రెజిల్ భద్రతా మండలిలో బలమైన పాత్ర పోషించడాన్ని చూడాలనుకుంటున్నాయని పునరుద్ఘాటించాయి. భారతదేశం చాలా కాలంగా UNSC సంస్కరణకు, ఆసియా, ఆఫ్రికన్ దేశాల భాగస్వామ్యాన్ని పెంచాలని కోరుతోంది. కానీ గతంలో చైనా వ్యతిరేకత కారణంగా ఇది అసాధ్యం అయింది. UNSC అనేది ఐక్యరాజ్యసమితిలోని ఆరు ప్రధాన అంగాలలో ఒకటి. ఇందులో ఐదు శాశ్వత, పది శాశ్వతేతర సభ్యులు ఉన్నారు. P5 అని కూడా పిలిచే ఈ శాశ్వత దేశాల సభ్యులకు వీటో అధికారం ఉంటుంది. శాశ్వతేతర సభ్యులు ప్రతి రెండేళ్లకు ఒకసారి మారుతారు.

ఈ ఐదు శాశ్వత సభ్యుల దేశాలలో చైనా తప్ప మిగిలిన అన్ని దేశాలతో భారతదేశానికి మంచి, బలమైన సంబంధాలు ఉన్నాయి. ఫ్రాన్స్ ఇప్పటికే భారతదేశ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇచ్చింది. చైనా దానిని అడ్డుకోకపోతే, UNSCలో శాశ్వత ప్రవేశానికి భారతదేశం మార్గం సుగమం అవుతుంది. వాస్తవానికి ఏదైనా అంశంపై నిర్ణయం తీసుకోవడానికి UNSC 15 సభ్యులలో తొమ్మిది మంది ఆమోదం పొందాలి. కానీ శాశ్వత సభ్యులలో ఒకరు తన వీటో అధికారాన్ని ఉపయోగిస్తే ఈ ప్రతిపాదన తిరస్కరించబడుతుంది.

READ ALSO: Parents Killed By Son USA: ఎవర్రా నువ్వు.. కన్న తల్లిదండ్రులను చంపానని టీవీ షోలో చెప్పిన కొడుకు !

Exit mobile version