No Traffic Lights Country: ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం.. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఆ కంట్రీ ఏదంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Traffic Lights Country: రోడ్డెక్కితే చాలు ట్రాఫిక్ జామ్‌లు, హోరుమనే హారన్లు తలనొప్పి తెప్పిస్తాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల నివాసితులు రోడ్డు మీదకు వెళ్లాలంటేనే ఆలోచించే పరిస్థితి ఉంది. ఒక్క భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి ఉంది. రోజూ ప్రయాణం చేసే వాళ్లకు ట్రాఫిక్ లైట్లు జీవితంలో ఒక కీలకమైన భాగం. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ లైట్లు లేకుండా ట్రాఫిక్ నియంత్రణ దాదాపు అసాధ్యం. కానీ ఒక్క ట్రాఫిక్ లైట్ సైతం లేని దేశం ఒకటి ఉందని మీకు తెలుసా? ఈ విషయం విని సందర్శకులు తరచుగా ఆశ్చర్యపోతుంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ట్రాఫిక్ సిగ్నల్స్ లేకున్నా.. అక్కడ ట్రాఫిక్ జామ్‌లు, హారన్ల శబ్దం ఉండదు. రోడ్లు ఎంతో ప్రశాంతంగా ఉంటాయి. ఆ దేశం ఏది? ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడానికి గల కారణం ఏంటి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: Water Bottle Cleaning Tips: ప్లాస్టిక్ బాటిల్స్ ఫ్రిజ్‌లో పెడుతున్నారా..? అయితే ఇది మీ కోసమే..!
Also Read
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
- New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
ప్రపంచంలోనే ట్రాఫిక్ సిగ్నల్స్ (ట్రాఫిక్ లైట్లు) లేని ఏకైక దేశంగా భూటాన్ పేరుగాంచింది. ఇందుకు అనేక కారణాలు సైతం ఉన్నాయి. భూటాన్ ప్రజలు యంత్రాల కంటే మనుషులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. అందుకే యంత్రాలను సాధ్యమైనంత వరకు దూరం పెడతారట. రాజధాని నగరం థింపూలో 1990లలో ఒకసారి ట్రాఫిక్ లైట్లను అమర్చార. కానీ అక్కడి ప్రజలు అవి చాలా “నిర్జీవంగా, యాంత్రికంగా” ఉన్నాయని భావించి కొన్ని గంటల్లోనే తొలగించారట. మనుషుల మధ్య ఉండే ఆత్మీయత ఆ లైట్లలో కనిపించడం లేదని భావించి వాటిని తొలగించారు. ట్రాఫిక్ లైట్స్ లేకుంటే ట్రాఫిక్ నియంత్రణ పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది. ట్రాఫిక్ లైట్లకు బదులుగా, అక్కడ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకమైన చేతి సంజ్ఞలతో (Hand Signals) వాహనాలను నియంత్రిస్తారు. వారు చేసే సంజ్ఞలు చాలా లయబద్ధంగా, చూడటానికి ఒక నృత్యంలా అనిపిస్తాయి. అందుకే వీరిని ‘డ్యాన్సింగ్ ట్రాఫిక్ పోలీస్’ అని కూడా అంటారు. అందమైన అలంకరణలతో కూడిన చిన్న చిన్న గదుల (Booth) నుంచి వీరు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారు. భూటాన్ తన సంప్రదాయాలను కాపాడుకోవడంలో చాలా ముందుంటుంది. ఆధునిక సాంకేతికత కంటే తమ సంస్కృతికి అద్దం పట్టే పద్ధతులనే వారు ఇష్టపడతారు. అలాగే, ట్రాఫిక్ లైట్ల వల్ల అనవసరమైన విద్యుత్ వినియోగం వద్దని వారు భావిస్తారు. అంతేకాదు.. అక్కడ వాహనదారులు చాలా క్రమశిక్షణతో ఉంటారు. హారన్లు ఎక్కువగా కొట్టరు, ఒకరినొకరు గౌరవించుకుంటూ డ్రైవ్ చేస్తారు. భూటాన్ జనాభా, వాహనాల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల కూడా ఈ పద్ధతి అక్కడ విజయవంతంగా నడుస్తోంది. ఈ దేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!