Site icon NTV Telugu

Bhoothaddam Bhaskar Narayana OTT: ఓటీటీలోకి రాబోతున్న థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Bhoothaddamm

Bhoothaddamm

ఈమధ్య కొత్తగా వచ్చిన సినిమాలు అన్ని మంచి టాక్ ను అందుకుంటున్నాయి. అందులో థ్రిల్లర్ మూవీగా వచ్చిన భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాకు మంచి టాక్ వచ్చింది.. థ్రిల్లర్, డీటేక్టివ్ మూవీగా వచ్చిన ఈ సినిమా మార్చి 1 న థియేటర్లలోకి వచ్చింది.. మొదటి నుంచి ఈ సినిమా పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. అదే విధంగా విడుదలకు ముందు రిలీజ్ అయిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో మంచి అంచనాలను ఈ చిత్రం నెలకొల్పింది.. ఓ మాదిరిగా కలెక్షన్స్ ను కూడా అందుకుంది..

శివ కందూకూరి హీరోగా నటించారు. పురుషోత్తమ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్‍ ను అందుకుంది.. ఇప్పుడు తాజాగా ఓటీటీలోకి రాబోతుంది.. ఈ సినిమా ఓటీటీ హక్కులను ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. ట్రైలర్ ఆకట్టుకోవటంతో రిలీజ్‍కు ముందే ఓటీటీ డీల్‍ను ఈ చిత్రం సొంతం చేసుకుంది. అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ సినిమా పై మార్చి 22 న ఓటీటీలోకి రాబోతుందని సమాచారం..

ఈ సినిమా విడుదలైన నెలలోపే స్ట్రీమింగ్ కు రాబోతుండటం విశేషం.. త్వరలోనే దీని పై అధికారక ప్రకటన రానుంది.. ఇక భూతద్దం భాస్కర్ నారాయణ చిత్రంలో శివ కందుకూరి ప్రధాన పాత్ర పోషించగా.. రాశి సింగ్, దేవీ ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివకుమార్, షఫీ, సురభి సంతోష్, శివన్నారాయణ తదితరులు ప్రత్యేక పాత్రల్లో నటించారు..

Exit mobile version