NTV Telugu Site icon

Bhumireddy Ramgopal Reddy: గెలవలేమని చెప్పి.. వైసీపీ రూ 50 కోట్లు ఖర్చుచేశారు

Bhumireddy Banner New

Bhumireddy Banner New

పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి. ఎన్నికల్లో అనూహ్య పరిణామాల మధ్య విజయం సాధించిన ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో గెలవలేమని చెప్పి .. 50కోట్లు ఖర్చు పెట్టారు. వైసీపీ నుంచి డబ్బు తీసుకుని ఓటర్లు మాకు తీర్పు ఇచ్చారు. ధర్మం వైపు నిలబడిన ఓటర్లు సరైన తీర్పు ఇచ్చారు. వైసీపీ వారు 2లక్షలు రూపాయలు ఓటర్లకు ఇస్తే.. ఆ డబ్బు నాకు ఇచ్చారు. కౌంటింగ్ సమయంలో కలెక్టర్ కు పై నుంచి ఒత్తిడి తీసుకొచ్చారన్నారు.

Read Also: Manchu Mohan Babu: చిరంజీవితో గొడవలు.. ఎట్టకేలకు నోరువిప్పిన మోహన్ బాబు

డిక్లరేషన్ ఇవ్వకుండా ప్రజా తీర్పును అపహాస్యం చేశారు. ప్రజా తీర్పును తారు మారు చేయాలనుకున్నారు. రాత్రి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించారు. చివరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో దిగి వచ్చారు. నా గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు రామగోపాల్ రెడ్డి. ఇటు అనంతపురం నుంచి పులివెందులకు బయలుదేరారు నూతన పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి. ఈ నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీ చేయాలన్న యోచనలో టిడిపి శ్రేణులు వున్నాయి. ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఘర్షణ ల నేపథ్యంలో ర్యాలీకి అనుమతించలేదు పోలీసులు. పులివెందులకు వచ్చే మార్గంలో, పట్టణంలో పలుచోట్ల భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటుచేశారు. పులివెందులకు రానీయకుండా రాంగోపాల్ రెడ్డి స్వగ్రామం కాంబల్లెకు తరలించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘర్షణలు జరగకుండా పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు.

Read Also: Sextortion Call : సరికొత్త ట్రాప్.. ‘సెక్స్‌టార్షన్’ బారిన పడ్డ 76ఏళ్ల వ్యక్తి