NTV Telugu Site icon

Bhumika Chawla : గోవాలో చిల్ అవుతున్న భూమిక.. లేటెస్ట్ లుక్ అదుర్స్..

Bhumika

Bhumika

టాలివుడ్ సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా sగురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు స్టార్ హీరోల అందరి సరసన జతకట్టింది.. యువకుడు సినిమాతో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ ఆ తర్వాత ఖుషీ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.. ఆ తర్వాత ఒక్కో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది.. ఎన్నో సినిమాల్లో నటించింది.. ఇప్పుడు వదిన, అక్క పాత్రల్లో నటిస్తుంది.. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా ట్రెండి వేర్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ఒకప్పుడు బిజీగా ఉన్న ఈ అమ్మడు పెళ్లి చేసుకొని ఇంటికే పరిమితం అయ్యింది.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసింది.. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్‌తో మెప్పిస్తోంది. ఎంఎస్ ధోని చిత్రంలో సుశాంత్‌కు అక్కగా నటించి మెప్పించింది. ప్రస్తుతం కంగనా రనౌత్ నటిస్తోన్న ఎమర్జన్సీ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటిస్తుంది.. సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న ఈమె ఇటీవలే కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టిందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి..

ఇకపోతే భూమిక ప్రస్తుతం గోవా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. 45 ఏళ్ల వయసులో కుర్రాళ్ళని ఆకర్షించే స్ట్రక్చర్ తో భూమిక మెస్మరైజ్ చేస్తోంది. టైట్ ఫిట్ బ్లాక్ టాప్, జీన్స్ షార్ట్ లో థైస్ చూపిస్తూ భూమిక రెచ్చిపోయింది అనే చెప్పాలి.. ప్రశాంతంగా చిల్ అవుతున్న దృశ్యాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రోజు రోజుకి భూమిక వయసు తగ్గిపోతున్నట్లు అనిపిస్తోంది.. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..