Bhumi Pednekar : అందరూ జాగ్రత్త.. దాని వల్ల 8 రోజులు నరకం అనుభవించా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇటీవలే ఈ భామ ది లేడీ కిల్లర్ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో అభిమానులను ఎంతగానో అలరించింది. అలాగే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అనే అడల్ట్ మూవీ తర్వాత ఈ భామ అర్జున్ కపూర్ సరసన నటించింది.ఈ చిత్రానికి అజయ్ బహల్ దర్శకత్వం వహించగా.. నవంబర్ 3న రిలీజైంది. ప్రస్తుతం అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ జంటగా మేరీ పట్నీ కా రీమేక్ అనే మరో మూవీ లో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రలో నటించనుంది. ఈ చిత్రానికి ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇదిలా ఉంటే భూమి పెడ్నేకర్ ప్రస్తుతం అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తుంది.. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది.
డెంగ్యూ కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు ఆమె వెల్లడించింది. ప్రస్తుతం ఆరోగ్యం అంతా బాగుందని తెలిపింది. ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అంతే కాకుండా దోమల నివారణ తప్పనిసరి అని ఆమె తెలియజేసింది.. అధిక కాలుష్యం కూడా మన అనారోగ్యానికి ఒక కారణమని భూమి ఫెడ్నేకర్ పేర్కొంది.భూమి ఇన్‌స్టాలో రాస్తూ.. “ఒక దోమ వల్ల నేను 8 రోజులు నరకం అనుభవించాను . దాదాపు వారం రోజుల తర్వాత నేను ఉదయాన్నే నిద్ర లేచా. అందుకే ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నా. అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను కొన్ని రోజులుగా నా కుటుంబానికి దూరంగా ఉండడం ఎంతో కష్టంగా అనిపించింది. ప్రతి ఒక్కరూ దోమలను చంపే వాటిని వినియోగించడం తప్పనిసరి. అలాగే మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోండి. అధిక కాలుష్యంతో మన రోగనిరోధక శక్తి చాలా వరకు తగ్గుతోంది. నాకు తెలిసిన చాలా మందికి కూడా డెంగ్యూ వచ్చింది. నన్ను బాగా చూసుకున్నందుకు ఆస్పత్రి సిబ్బందికి కృతజ్ఞతలు’ అని ఆమె ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!