NTV Telugu Site icon

TTD Chairman: టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి..

Bhumana

Bhumana

తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌ రెడ్డిని సీఎం జగన్ నియమించారు. ఈమేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వైవీ సుబ్బారెడ్డి స్థానంలో భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. గతంలో టీటీడీ చైర్మన్‌ గా భూమన కరుణాకర్‌ రెడ్డి పని చేశారు.2006-2008 మధ్య టీటీడీ చైర్మన్‌గా భూమన పనిచేశారు. టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్‌ రెడ్డి రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తనను టీటీడీ ఛైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కరుణాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా భూమన కరుణాకర్‌ రెడ్డి ఉన్నారు.

Read Also: Ruchitha Sadineni: క్యూట్ లుక్స్ తో రుచిత సాధినేని ఫోజులు

అయితే, ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పూర్తి స్థాయిలో రాజకీయ వ్యవహారాలు చూడనున్నారని సమాచారం. వైవీ సుబ్బారెడ్డిది ఈ నెల పదో తేదీతో రెండు సార్లు అంటే నాలుగేళ్ల పదవి కాలం పూర్తవుతుంది. ప్రస్తుత చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి 2019లో ఆ బాధ్యతలు చేపట్టారు. ఇక ప్రస్తుతం చైర్మన్‌తో పాటు టీటీడీలో 35 మంది పాలక సభ్యులు ఉన్నారు. ఇప్పుడున్న చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ఇంకో వారం రోజుల్లో ముగియనుంది.

Read Also: TTD Chairman: టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి..

అయితే, వాస్తవానికి రెండేళ్ల క్రితమే టీటీడీకి కొత్త చైర్మన్ ని నియమించాల్సి ఉంది. కానీ, వైవీ సుబ్బారెడ్డికి రెండోసారి పదవిని ఏపీ ప్రభుత్వం కొనసాగించింది. టీటీడీ ఛైర్మన్ రేసులో ఈసారి కూడా చాలా పేర్లు పరిశీలనకు వచ్చాయి. నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. ఆ పోస్ట్ కాపులకు ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపించింది. కానీ సీఎం జగన్ మాత్రం కరుణాకర్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న కరుణాకర్ రెడ్డి, టీటీడీ చైర్మన్ గా త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారు. రాబోయే బ్రహ్మోత్సవాలు కూడా ఆయన హయాంలోనే జరిగే అవకాశాలున్నాయి.