NTV Telugu Site icon

Bhuma Mounika : నెట్టింట వైరల్ అవుతున్న మంచు మనోజ్ భార్య బేబీ బంప్స్ ఫోటోలు..

Bhuma Mounika

Bhuma Mounika

మంచు మనోజ్ గత ఏడాది భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. అయితే మౌనిక ప్రగ్నెంట్ అన్న విషయాన్ని మనోజ్ ప్రకటించారు.. తాజాగా బేబీ బంప్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.. బ్లాక్ డ్రెస్ లో బేబీ బంప్ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది మౌనిక. మనోజ్ తో కలిసి దిగిన ఫొటోని కూడా షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

మౌనిక బేబీ బంప్స్ ఫోటోలను షేర్ చేస్తూ.. నా జీవితం, నా పక్కన ఉండే వాళ్ళతో ఎప్పుడూ నన్ను ఆకర్షిస్తుంది. నన్ను మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడేలా చేస్తుంది అంటూ మనోజ్ ని, తన మొదటి కొడుకు ధైరవ్ ని ట్యాగ్ చేసింది. ఈ పోస్ట్ కి మనోజ్ సరదాగా.. పిల్లా ఓ పిల్లా నువ్వంటే నాకు ప్రాణమే అని కామెంట్ చేసాడు.. దాంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ఇక వీరిద్దరూ కలిసి కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.. నమస్తే వరల్డ్‌ అనే బొమ్మల షాపును ప్రారంభించినట్లు తెలిపారు.. ఈ బొమ్మల షాపు ను అతి త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.. ఇక మనోజ్ సినిమాల విషయానికొస్తే.. సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు.. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో బిజీ కావాలని ట్రై చేస్తున్నారు. ఇటీవలే ఆయన ఓ టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు మనోజ్. తన సినిమాలతోనూ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు…