Site icon NTV Telugu

Bhola Shankar : ఆ విషయంలో దర్శకుడు మెహర్ రమేష్ మిస్టేక్ చేసాడా..?

Whatsapp Image 2023 07 22 At 9.35.59 Am

Whatsapp Image 2023 07 22 At 9.35.59 Am

వాల్తేరు వీరయ్య సినిమా తో ఈ సంవత్సరం ఆరంభం లో నే బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి..ఆ సినిమా భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టింది..దీనితో మెగాస్టార్ నుండి తరువాత రాబోతున్న సినిమా పై మెగా అభిమానుల తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాల్తేరు వీరయ్య సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలో నటించాడు.ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.భోళా శంకర్ సినిమా ఆగస్టు నెల 11 వ తేదీన ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.దీనితో ఈ సినిమా పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కు మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించారు.ఆయన గతం లో అందించిన పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కానీ చిరంజీవి కోసం ఆయన ఇచ్చిన పాటలు మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదని సమాచారం.

దీనితో మెగాస్టార్ అభిమానులు ఈ సినిమా కు దేవి శ్రీ ప్రసాద్ లేదా థమన్ వంటి సీనియర్ సంగీత దర్శకులను తీసుకోని ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనుభవం లేని సంగీత దర్శకుడు పాటలు అందిస్తే ఇలాగే ఉంటుందని కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమాకు చిత్ర యూనిట్‌ సభ్యులు భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు.. కానీ సినిమా పాటలు ఆశించిన స్థాయి లో ఆకట్టుకోలేక పోవడంతో ఎంత ప్రమోషన్ చేసినా కూడా వృధా అవుతున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమా లో చిరంజీవి సరసన హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది. ఇక చిరంజీవి చెల్లెలి పాత్ర లో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించింది..మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Exit mobile version