Bhatti Vikramarka: భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి తొలి పునాది రాయి వేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా.. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు దేశ భవిష్యత్తును ప్రభావితం చేయనుందని పేర్కొన్నారు. ఏ నగరానికి లేని వ్యవస్థ తెలంగాణకు రాబోతోందని, ఇది ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించబడుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు కూడా తీసుకువచ్చారని, ఇది కేవలం పాత నగరం కాదని, ఒరిజినల్ సిటీ అని సీఎం చెప్పినట్లు భట్టి గుర్తు చేశారు.
CM Revanth: పదేళ్లు నాకు అవకాశం ఇవ్వండి.. ఫ్యూచర్ సిటీని న్యూయార్క్ కి పోటీగా తయారు చేస్తా
ఫ్యూచర్ సిటీ ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా కనెక్ట్ అవుతుందని, ఇక్కడి నుండి బందరు పోర్ట్‌కు కూడా లింక్ చేసే ప్రణాళికలు ఉన్నాయని భట్టి తెలిపారు. అలాగే, భవిష్యత్తులో బెంగళూరుతో కూడా ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ ఏర్పడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ దేశాలను ఆహ్వానిస్తున్నారని, అభివృద్ధి కార్యక్రమాలతో ఫ్యూచర్ సిటీకి రావాలని పిలుపునిస్తున్నారని భట్టి పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ శంకుస్థాపన చూస్తుంటే.. కులీ కుతుబ్ షా రోజులు గుర్తుకు వస్తున్నాయనని ఆయన అన్నారు. కులీ కుతుబ్ షా నగరాన్ని ప్రజలతో నింపమని దేవుడిని ప్రార్థించినట్లుగానే, సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీని అభివృద్ధి కార్యక్రమాలతో నింపాలని కోరుతున్నారని అన్నారు.
Mega Family: చిరు ఫ్యామిలీలో మరో శుభవార్త.. బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పనున్న మెగా హీరో !
అలాగే విదేశాలకు వెళ్లి స్థిరపడాలనుకునేవారు తిరిగి వచ్చి సెటిల్ అవ్వడానికి ఫ్యూచర్ సిటీ ఒక సరైన గమ్యస్థానంగా మారుతుందని భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ నగరం నిర్మాణం పూర్తి చేసుకోవాలని కోరుతున్నానని, భవిష్యత్తు అంతా ఈ ఫ్యూచర్ సిటీలోనే ఉందని ఆయన పేర్కొన్నారు.
