NTV Telugu Site icon

Maoist Bandh: నేడు బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు.. ఏజెన్సీ ప్రాంతాల్లో హైఅలెర్ట్

Bharath Bandh

Bharath Bandh

Maoist Bandh: మావోయిస్టులు నేడు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. దండకారణ్యాన్ని భద్రత బలగాలతో జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారు. ఈనెల 22న భారత్ బంద్ పిలుపును బంద్ పిలుపును విజయవంతం చేయాలంటూ మావోయిస్టులు కరపత్రాలను వదిలివెళ్లారు. ఇటీవల పోలీసులు, మావోయిస్టులు మధ్య జరిగిన కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా మావోయిస్టులు బంద్‌ పిలుపునిచ్చినట్లు సమాచారం.

Read Also: Election Commission Guidelines: బదిలీలు, పోస్టింగ్‌లపై ఈసీ మార్గదర్శకాలు.. ఏపీ సహా 4 రాష్ట్రాల సీఎస్‌లకు కీలక ఆదేశాలు

ఛత్తీస్‌గఢ్‌ లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. సుక్మా జిల్లా నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలోని దండకారణ్యంలో మావోయిస్ట్ బేస్ క్యాంపులను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన దాడుల్లో ఎనిమది మంది మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిసింది. అయితే మావోయిస్టుల డిమాండ్స్ పై ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు.