తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ వరుస అవకాశాలు అందుకొని ఇండస్ట్రీలో స్థిరంగా కొనసాగడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంటారు అయితే కొంతమంది హీరోయిన్లకు ఇండస్ట్రీలో నటించాలని ఉన్నప్పటికి అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు..ఈ విధంగా అవకాశాల కోసం ఎదురు చూస్తూ వున్న హీరోయిన్స్ లలో నటి భాను శ్రీ మెహ్రా ఒకరు. ఈ భామ తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తనకు యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టం మంచి అవకాశాలు కోసం ఎదురుచూస్తున్నాను అంటూ చేసిన ట్వీట్ ప్రస్తుతం బాగా వైరల్ గా మారింది.భాను శ్రీ మెహ్రా తన మొదటి సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన చేసింది.నటించినవీరిద్దరూ జంటగా నటించిన సినిమా వరుడు.ఈ సినిమా ద్వారా భానుశ్రీ మెహ్రా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాను గుణశేఖర్ భారీగా తెరకెక్కించారు.కానీ వరుడు సినిమా దారుణంగా ప్లాప్ అయింది.ఈమె తన మొదటి సినిమాతోనే బిగ్ డిజాస్టర్ ను అందుకుంది..
ఆ తరువాత పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది ఈ భామ.. అయితే ఇటీవల ఈ భామ అల్లు అర్జున్ తనని బ్లాక్ చేశారు అంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ కారణంగా ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఇలా అప్పటినుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన ఈ భామ తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక సినిమాలలో తిరిగి నటించడం కోసం ఎదురుచూస్తున్న భాను శ్రీ మెహ్రా ట్విట్టర్ వేదికగా పలు ఆసక్తికర విషయాలను తెలియజేసింది… ఇక ఈమెకు సినిమా అవకాశాలు లేకపోవడంతో పలు వెకేషన్ లకి వెళ్తూ అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంది..అయితే సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఈ సందర్భంగా భాను శ్రీ మెహ్రా చేసిన కామెంట్స్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/IAmBhanuShree/status/1680122506919968768?s=20
