తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ఛానెల్ ‘భక్తి టీవీ’ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. దేశంలోనే ‘నంబర్-1’ ఆధ్యాత్మిక ఛానెల్‌గా భక్తి టీవీ నిలిచింది. బార్క్ (BARC) ఈరోజు రిలీజ్ చేసిన రేటింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. టాప్ హిందీ ఛానెల్స్‌ను సైతం అధిగమించి భక్తి టీవీ నెంబర్ వన్ స్థానంకు దూసుకొచ్చింది. సంస్కార్ టీవీ రెండో స్థానంలో ఉండగా.. సిద్దార్థ్ ఉత్సవ్ మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో దివ్య, ఆస్తా, ఎస్వీబీసీ నిలిచాయి.
Also Read: Portronics Projector Launch: కేవలం 10 వేలతో.. మీ ఇంటిని బెస్ట్ థియేటర్‌గా మార్చేయొచ్చు!
ఇండియా అర్బన్ కేటగిరిలో కూడా భక్తి టీవీ అగ్రస్థానంలో ఉంది. ఎనమిది టీఆర్పీ పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఈ కేటగిరిలో సంస్కార్, దివ్య, సిద్దార్థ్ ఉత్సవ్ వంటి ఛానెల్స్.. భక్తి టీవీ తర్వాతే ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఏటా కోటిదీపోత్సవం అనే మహోత్తర కార్యక్రమంని భక్తి టీవీ నిర్వహిస్తోంది. నవంబర్ 1 నుంచి కోటిదీపోత్సవం 2025 కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఈ దీపాల పండగ నవంబర్ 13 వరకు ఘనంగా జరగనుంది.
