NTV Telugu Site icon

Bhaje Vaayu Vegam : ఓటీటీలోకి వచ్చేస్తున్న’భజే వాయు వేగం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Karthikeya

Karthikeya

Bhaje Vaayu Vegam : టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ యంగ్ హీరో “ఆర్ఎక్స్ 100 ” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.ఆ సినిమా కార్తికేయ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా తరువాత కార్తికేయ వరుస సినిమాలలో నటించాడు.అయితే తాను నటించిన ఏ సినిమా కూడా “ఆర్ఎక్స్ 100 “రేంజ్ హిట్ అందుకోలేదు.ఈ యంగ్ హీరో గత ఏడాది “బెదురులంక 2012 “సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా మంచి విజయం సాధించింది.ఇదిలా ఉంటే కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ “భజే వాయు వేగం “..ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తికేయ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది.

Read Also :SSMB29 : రాజమౌళి సినిమాకోసం భారీ రిస్క్ చేస్తున్న మహేష్..?

ఈ సినిమాలో హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్ర పోషించాడు.ఈ సినిమా విడుదలకు ముందు ఈ చిత్రానికీ సంబందించిన పోస్టర్స్ ,టీజర్స్ ,ట్రైలర్ సినిమాపై బాగా హైప్ తీసుకొచ్చాయి.మే 31 న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది.ఈ సినిమాలో సస్పెన్స్ తో కూడిన ఎలెమెంట్స్ అలాగే క్లైమాక్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.థియేట్రికల్ రిలీజ్ అయిన నెల తరువాత ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ అయ్యేలా ఒప్పందం కుదుర్చుకుంది.దీనితో ఈ సినిమా ఈ నెల చివరి వారంలో కానీ జులై మొదటి వారంలో కానీ ఓటిటి స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తుంది.

Show comments