నవంబర్ 27న విడుదలైన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకోవడంతో తాజాగా చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఇందులో భాగంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఆసక్తికర విషయాలు పంచుకుంది. సినిమా షూటింగ్ సమయం నుండి రామ్ పోతినేని తో డేటింగ్ రూమర్స్ వినిపించినప్పటికీ, వాటన్నింటినీ పుకార్లుగానే కొట్టిపారేసిన ఈ బ్యూటీ.. రామ్ వ్యక్తిత్వం పై ప్రశంసల వర్షం కురిపించింది. రామ్ ఎప్పుడూ చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తారని, ఆయన ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని కొనియాడింది. ముఖ్యంగా షూటింగ్ సెట్స్‌లో కూడా రామ్ ఆ ఎనర్జీని కొనసాగిస్తారని, ఆయన నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని భాగ్యశ్రీ చెప్పుకొచ్చింది.
Also Read : Sankranthiki Vasthunnam : ‘సంక్రాంతికి వస్తున్నాం’ 2 కి లైన్ క్లియర్!
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు రామ్ పోతినేనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి చిరాకు పడే కొంతమంది సెలబ్రిటీలు రామ్ నుండి ఈ పాజిటివిటీని చూసి నేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పూణేకు చెందిన భాగ్యశ్రీ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుని, ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ తో మరో విజయాన్ని అందుకుంది. మోడలింగ్ నుంచి నటిగా ఎదిగిన ఆమె, త్వరలో మరిన్ని తమిళ, హిందీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
