Bhagavanth Kesari : గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి…మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.రీసెంట్ గా అక్టోబర్ 8న ట్రైలర్ లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రైలర్ లాంఛ్ వెన్యూ పై అప్‌డేట్ అందించారు మేకర్స్.హన్మకొండలోని యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ కొత్త లుక్ విడుదల చేయగా సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతోంది. బాలకృష్ణ ఈ చిత్రం లో నేలకొండ భగవంత్ కేసరిగా పక్కా తెలంగాణ యాస లో మాస్ అవతారాన్ని చూపించేందుకు సిద్ధం అవుతున్నట్టు టీజర్‌తోనే తెలియజేసాడు దర్శకుడు అనిల్ రావిపూడి.
ఇప్పటికే భగవంత్ కేసరి మూవీ నుంచి విడుదల చేసిన గణేశ్ ఆంథెమ్, ఉయ్యాలో ఉయ్యాలా నెట్టింట భారీగా వ్యూస్ రాబడుతూ.. ప్రేక్షకుల అందరినీ ఆకట్టుకుంటున్నాయి.ఈ సారి మీ ఊహలకు మించి.. అంటూ ట్రైలర్ అప్‌డేట్ అందించి అబిమానుల్లో జోష్ నింపుతున్నారు మేకర్స్.. ఈ చిత్రం లో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది..యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురిగా కీలక పాత్రలో నటిస్తోంది, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. భగవంత్ కేసరి అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.అక్టోబర్ 18న యూఎస్‌ఏ లో గ్రాండ్‌గా ప్రీమియర్స్ ను వేయనున్నారు.ఈ సినిమాను ఓవర్సీస్ లో పాపులర్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సరిగమ సినిమాస్ విడుదల చేస్తుంది. ఈ సారి బాలయ్య మాస్ జాతర చూడటానికి ఫ్యాన్స్ అందరూ సిద్ధంగా వున్నారు.
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
తాజావార్తలు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!