NTV Telugu Site icon

Bhagavanth Kesari : అదిరిపోయే యాక్షన్ సీన్స్ తో తెరకెక్కుతున్న బాలయ్య సినిమా..?

Whatsapp Image 2023 07 15 At 1.39.57 Pm

Whatsapp Image 2023 07 15 At 1.39.57 Pm

నందమూరి నటసింహం బాలకృష్ణ వరస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే..బాలయ్య అఖండ సినిమా తో తిరుగులేని విజయం అందుకున్నారు. అఖండ సినిమా బోయపాటి దర్శకత్వం లో తెరకెక్కింది. ఈ సినిమాలో బాలయ్య అఘోర పాత్ర లో అద్భుతంగా నటించి మెప్పించారు. ఆ తరువాత గోపిచంద్ మలినేని దర్శకత్వం లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు బాలయ్య. యంగ్ హీరోల కు పోటీ గా వరుస సినిమాలు చేస్తూ వరుస విజయాలు సాధిస్తున్నారు బాలయ్య..ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఓ సినిమాను చేస్తున్నారు . ఈ సినిమా కు బాలయ్య బర్త్డే సందర్బం గా భగవంత్ కేసరి అనే పవర్ ఫుల్ టైటిల్ ను అనౌన్స్ చేసారు అదేరోజు సినిమా నుంచి టీజర్ ను కూడా విడుదల చేసారు..టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. టీజర్ తో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి.

ఈ సినిమా లో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అలాగే శ్రీలీల బాలయ్య కు కూతురి పాత్రలో నటిస్తుంది..ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం సినిమా లో ఓ భారీ యాక్షన్ సీన్ ను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ యాక్షన్ సీన్ లో బాలకృష్ణతో పాటు ఇతర ఆర్టిస్ట్ లు కూడా పాల్గొంటున్నారని తెలుస్తోంది.స్టంట్ మాస్టర్ వెంకట్ డైరెక్షన్ లో ఈ యాక్షన్ సీన్స్ తెరకెక్కుతోందని సమాచారం.. ఈ యాక్షన్ సీన్ పది రోజుల పాటు చిత్రికరించనున్నారు.. ఇప్పటికే షెడ్యూల్ ను కూడా మొదలు పెట్టారు.ఈ యాక్షన్ సీన్ తర్వాత సినిమాలో అదిరిపోయే సాంగ్ ను తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ సినిమాలో బాలయ్య యాక్షన్ సీన్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయని సమాచారం.ఈ సినిమా తరువాత బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో తన 109 వ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం.

Show comments