ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స, ప్రసవం అంటే చాలా మంది భయపడిపోతుంటారు. ప్రభుత్వ వైద్యంపై ఇప్పటికీ కొందరిలో చిన్న చూపు కూడా ఉంది. అక్కడ వైద్య సౌకర్యాలు సరిగా ఉండవని, డాక్టర్లు సరిగా పట్టించుకోరని జనాలు అంటుంటారు. అయితే కొందరు ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు కృషి చేస్తుంటారు. తాజాగా ఓ జిల్లా కలెక్టర్ తన భార్య ప్రసవంను ప్రభుత్వ ఆసుపత్రిలో చేపించి.. జనాల్లో నమ్మకం పెంచే ప్రయత్నం చేశారు.
Also Read: KTR: ఎన్డీఎస్‌ఏ నివేదిక కాదు.. అది ఎన్డీయే నివేదిక!
పాల్వంచ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ సతీమణి శ్రద్ధ జీతేష్ వి పాటిల్ బుధవారం ప్రసవించారు. కలెక్టర్ సతీమణి పండండి మగ బిడ్డకి జన్మనిచ్చారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు చెప్పారు. కలెక్టర్ సతీమణి గత కొన్ని నెలలుగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలొనే పరీక్షలు చేయించుకున్నారు. కలెక్టర్ సతీమణి తొలి కాన్పులో కూడా మగ బిడ్డకు జన్మనిచ్చారు. కలెక్టర్ స్థాయిలో ఉండి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో సతీమణికి ప్రసవం చేయించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ చాలా మందికి ఆదర్శం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
