Site icon NTV Telugu

Fake Calls Alert: *401# కాల్స్‌తో జాగ్రత్త! టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ హెచ్చరిక

Telecom Alert

Telecom Alert

Malicious Calls: టెలికామ్‌ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నమంటూ సైబర్ నేరగాళ్లు ప్రజలకు ఫోన్ చేసి *401# టైప్ చేసి మేము సూచించిన మొబైల్‌ నెంబర్‌ ఎంటర్ చేసి డయల్‌ చెయ్యండి అని సైబర్ నేరగాళ్లు కోరుతున్నారు. మీ సమస్య పరిష్కారం అవుతుందని ఎవరైనా కాల్ చేసి చెబితే.. తొందరపడకండి.. అలా చెయ్యమని ఏ టెలికామ్‌ సంస్థ మిమ్మల్ని కోరదు అని టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ పేర్కొనింది. సైబర్‌ నేరగాళ్లు కొత్త రకం మోసానికి పాల్పడుతున్నారని చెబుతున్నారు.

Read Also: Union Minister Kishan Reddy: వేగంగా రైల్వేల అభివృద్ధి.. 2.94 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాం..

ఒక వేళ సదరు అపరిచిత వ్యక్తి చెప్పినట్టుగా *401# తర్వాత గుర్తు తెలియని నంబర్‌ ఎంటర్ చేసి డయల్‌ చేస్తే ఇక అంతే సంగతి అనుకోండి. మీ సిమ్‌కు రావాల్సిన ఫోన్‌ కాల్స్‌ ఆ గుర్తు తెలియని నంబర్‌కు వెళ్లేందుకు అవసరమైన కాల్‌ ఫార్వార్డ్‌కు మీరు పర్మిషన్ ఇచ్చినట్లే తెలుస్తుంది. ఇక, ఆ కాల్స్‌ను రిసీవ్‌ చేసుకున్న వాళ్లు వాటితో ఈజీగా మోసాలకు పాల్పడతారు. ఈ *401# నెంబర్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టెలికామ్‌ శాఖ ఓ హెచ్చరిక జారీ చేసింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ విషయంలో అలర్ట్ గా ఉండాలని చెప్పింది. వినియోగదారులు తమ ఫోన్‌ సెట్టింగ్స్‌లో కాల్‌ ఫార్వార్డింగ్‌ ఆప్షన్‌ ఇనేబుల్‌లో ఉంటే వెంటనే డిసేబుల్‌ చేసుకోవాలని పేర్కొనింది.

Exit mobile version