Site icon NTV Telugu

Betting Apps Case: నేడు విచారణకు హాజరు కానున్న..హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి

Betting App Case

Betting App Case

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ వేగం పెంచింది. సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు సంబంధించి పలువురు సినీ ప్రముఖులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నటుడు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, నటుడు ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి పేర్లు బయటకు రావడంతో చర్చనీయాంశమైంది. వీరిలో రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ ఇప్పటికే ఈడీ విచారణకు హాజరయ్యారు.

Also Read : Priyanka Mohan ; భారీ ప్రాజెక్ట్‌తో.. కన్నడకు రీఎంట్రీ ఇచ్చిన ప్రియాంక మోహన్

ఇక తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. నటి నిధి అగర్వాల్, ప్రముఖ యాంకర్ శ్రిముఖి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అమృత చౌదరి పేర్లు కూడా విచారణ జాబితాలో చేరాయి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఐడీ కార్యాలయానికి హాజరవ్వాలని వారికి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సమయంలో వారు తెలుసుకున్న సమాచారం ఏమిటీ? ఒప్పందాలు ఎలా కుదిరాయి? ఆర్థిక లావాదేవీలు జరిగినాయా? వంటి కీలక అంశాలపై విచారణ జరగనుండగా, సినీ ప్రముఖులు ఇందులో వరుసగా చేరుతున్నందున ఈ కేసుపై మరింత దృష్టి పడుతోంది. విచారణ కొనసాగుతున్నకొద్దీ ఇంకా ఎవరికి నోటీసులు వెళ్లే అవకాశం ఉందో, అలాగే ఈ కేసు తదుపరి దిశ ఏవిధంగా ఉండబోతోందో అన్నది ఇప్పుడు పరిశ్రమలో, సోషల్ మీడియా వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.

 

Exit mobile version