Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Best Tips For Brain Development Telugu

Brain Charge : వీటితో మీ బ్రెయిన్‌ని రీఛార్జ్‌ చేయండి..

Published Date :October 13, 2022 , 11:06 am
By Gogikar Sai Krishna
Brain Charge : వీటితో మీ బ్రెయిన్‌ని రీఛార్జ్‌ చేయండి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Best Tips For Brain Development Telugu

కొన్ని పనులకు శారీరిక బలం ఉంటే సరిపోతుంది. కానీ కొన్ని పనులకు బుద్ధిబలం కూడా అవసరం. బుద్ధి బలం పెరగాలంటే మన మెదడుకి మంచి శిక్షణ ఇవ్వాలి. చురుగ్గా పని చేసేలా చూసుకోవాలి. సమస్యలు వచ్చినప్పుడు స్మార్ట్‌గా ఆలోచించి సమస్యకు తగిన పరిష్కారం దొరికేలా మన మెదడుని తయారు చేసుకోవాలి. నడకతో మెదడుకు మేలు అంటున్నారు పరిశోధకులు. యువకులు, నడి వయస్కులు కన్నా ఎక్కువగా వృద్ధులకి ఆరోగ్యంగా ఉండటంలో దోహత పడుతుందని డాక్టర్లు చెప్తున్నారు. ప్రతి రోజు మూడు వేల నుంచి నాలుగు వేల అడుగులు నడవ గలిగితే వారికి మతి మరుపు సమస్య తలెత్తదు అని, అంతేకాకుండా ఇంతకు ముందు ఉన్నదానికన్నా వారి మెదడు ఎంతో చురుగ్గా పని చేస్తుందని పరిశోధనలో వెల్లడైంది. పరిశోధకులు వృద్ధులను రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూప్‌ వారిని ప్రతిరోజు నాలుగు వేల అడుగులు నడవ మన్నారు. రెండో గ్రూప్‌ వారిని ఎప్పటిలాగే ఉండమన్నారు. కొద్ది రోజుల తర్వాత నాలుగు వేల అడుగులు నడిచిన వృద్ధులలో ఊహించని విధంగా మార్పు కనిపించింది. వారి మెదడు మునుపటి కన్నా చురుగ్గా పని చేస్తుందని వారు కనుగొన్నారు. కేవలం నడవటం వలన ఇంత మార్పు చోటు చేసుకుందా అని మరిన్ని పరిశోధనలు నిర్వహిస్తునారు.

వేరుశనగతో మెదడుకి ఆరోగ్యం, మనం టైంపాస్‌ కోసం తినే వేరుశనగ గింజలతో కూడా మెదడుకి ఆరోగ్యం అంటున్నారు వైద్యులు. వీటిలో ఉండే బీ3 విటమిన్లు మన మెదడు జ్ఞాపక శక్తిని పెంచడానికి ఎంతగానో దోహత పడుతుందని చెప్పుతున్నారు. వేరుశనగలో ఉండే అమినో యాసిడ్స్‌ ప్రశాంతతను పెంచే సెరిటోనిన్‌ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయని, వాటివలన మనసు ఉల్లాసంగా ఉంటుందని, అలాగే మెదడు చురుగ్గా పని చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. బాగా మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు గుప్పెడు శనగలు గింజలు తింటే త్వరగా డిప్రెషన్‌ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మెదడు చురుగ్గా, ఆరోగ్యంగా పనిచేయాలంటే మౌనంగా ఉండటం కూడా ఒక మంచి మార్గం అని, సైలంట్‌కి బ్రెయిన్‌కి మధ్య అవినాభావ సంబంధం ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు. బాగా ఒత్తిడికి గురైనప్పుడు కాసేపు ఎవరితో మాట్లాడకుండా మౌనం వహిస్తే మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు. మౌనంగా ఉన్నప్పుడు మెదడులోని ఇప్పు హిపోకంపస్‌ అనే భాగంలో కొత్త కణాలు ఏర్పడతాయి అని, అవి మైండ్‌ డిప్రెషన్‌ను తగ్గిస్తాయి అని అంటున్నారు.

Walking

ఈ కణాలు కొత్త ఆలోచనలు రావడానికి బాగా పనిచేస్తాయి. దీనిని మొదటగా ఎలుకల మీద ప్రయోగం చేశారు. కొన్ని ఎలుకలను, ఒక నిశ్శబ్దమైన ప్రదేశంలో ఎలాంటి శబ్దాలు లేకుండా ఉంచారు. దానితో కొంతకాలం తర్వాత వాటి మెదడులో హిపోకంపస్‌ అనే భాగంలో కొత్త కణాలు ఏర్పడ్డాయని నిపుణులు వెల్లడించారు. అదే విధంగా మనం ప్రశాంతంగా, మౌనంగా ఉండటం వలన మన భావోద్వేగాలను సులువుగా నియంత్రించుకోవచ్చు. వ్యాయామంతో కూడా మెదడుకి ఆరోగ్యం.

Hippocampus

ప్రతిరోజు 20 నిమిషాల పాటు తీవ్ర వ్యాయామం చేస్తే మెదడు చురుగ్గా తయారవుతుందని ఒక పరిశోధనలో తేలింది. చిత్త వైకల్యం, అల్జైమర్స్‌తో బాధపడేవాళ్ళు ఎక్కువగా శ్రమిస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 6 వారాల పాటు కొంత సమయం ఎక్కువగా ఎక్సర్సైజ్‌ చేసిన వారిని పరిశీలించగా వారి జ్ఞాపకశక్తిలో మెరుగుదల కనబడినట్టు వెల్లడించారు.

 

Silent

మనం ఏ పని చేయాలన్నా మెదడు చురుకుదనం చాలా అవసరం. బ్రెయిన్‌ పవర్‌ పెంచాలంటే ఎప్పుడు మెదడుని ఊరికే ఉంచకుండా ఏదో ఒక పని అప్పగిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ చేసే పనులను కొత్తగా చేయడంలో లేదా కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త భాషలు నేర్చుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. ఇలా నిరంతరం మెదడుకి పని అప్పగిస్తే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. సుడోకో లాంటి ఆడటం వలన ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే మెదడుకి ఒత్తిడి పెరిగినప్పుడు పనిభారం ఎక్కువైనప్పుడు దానికి తగినంత విశ్రాంతి తీసుకోవటం ఎంతగానో అవసరం. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పై చెప్పిన విధంగా పలు పద్ధతులను పాటించి మన మెదడుని చురుగ్గా పని చేసేలా చేసుకోవచ్చు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Best Food
  • Best Health Tips
  • Brain Development Tips
  • Brain Power Tips
  • depression

తాజావార్తలు

  • Ambati Rambabu: అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు.. 2029కి ఏడు బిల్డింగ్‌లైనా పూర్తి చేస్తారా..?

  • Lockdown: లాక్ డౌన్ వచ్చేసింది.. ఉదయం 9 నుంచి 4 గంటల వరకే ఆఫీస్‌లు..

  • Ragi Milk Recipe: వేసవి దాహాన్ని తీర్చే నేచురల్ ఎనర్జీ డ్రింక్.. ఇంట్లోనే టేస్టీ ‘రాగి పాలు’ చేసుకోండిలా!

  • War Effect: యుద్ధం ఎఫెక్ట్.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్..

  • Iron Rich Foods: బాబోయ్ బ్లడ్ తగ్గిందా?.. ఇవి తింటే సరిపడా రక్తం పడుతుంది!

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions